
mahesh babu movie watched by indira devi
Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతితో కృష్ణ కుటుంబం అంతా కూడా ఎంతో కుమిలిపోయారు. మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత, కూతురు సితార తీవ్రంగా ఎమోషనల్ అయ్యారు. ఈ యేడాది కృష్ణ ఫ్యామిలీలో ఇది రెండో మరణం. జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసిన ఘటన మరవక ముందే తాజాగా కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నమూయడం విషాదకరం. రీసెంట్ గా ఆమె దశదిన కర్మను కూడా వారి నివాసంలోనే జరిపించారు. ఇక వారి సొంతూరిలో ఇందిరా దేవి సంస్మరణ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏ సినిమా అంటే..
ఇందిరా దేవికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తేజ డైరెక్షన్ లో వచ్చిన ‘నిజం’ చిత్రం ఇందిరాదేవికి చాలా ఇష్టమట. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్, తల్లి, కొడుకు మధ్య సాగే సన్నివేశాలు ఆడియెన్స్ చేత కంటతడి పెట్టించాయి. అయితే ఇందిరా దేవి ఇదే సినిమాను తను చనిపోయే వరకు వందసార్లు చూసిందంట. అంతేకాకుండా తను మరణించడానికి నెల రోజుల ముందుకు కూడా ‘నిజం’ సినిమా చూసిందంట. తల్లి, కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయని. ఇవి ఇందిరా దేవిని కూడా ఎంతో ఎమోషనల్‌కి గురి చేశాయని సమాచారం.
mahesh babu movie watched by indira devi
ఈ సినిమాని వంద సార్లు కూడా చూసిందని టాక్.ఇక ఇందిరా దేవి జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. డిగ్రీ పూర్తైన వెంటనే కృష్ణ.. మద్రాసు వెళ్లి అక్కడ సినిమా అవకాశాల కోసం వేట మొదలుపెట్టారు. అలా 1965లో ‘తేనే మనసులు’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఆయన.. అదే సంవత్సరం నవంబర్‌లో ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్నేళ్లపాటు కృష్ణ- ఇందిరా దేవి దంపతుల వైవాహిక జీవితం సజావుగా సాగింది. ఈ జంటకు రమేష్ బాబు, పద్మావతి జన్మించారు. ఆ సమయంలోనే కృష్ణ, తోటి నటి విజయ నిర్మలతో సహజీవనం చేసినట్లు ప్రచారం జరిగింది. అదే నిజం చేస్తూ 1969లో విజయ నిర్మలను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణ.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.