Big Breaking : సూపర్ స్టార్ కృష్ణ ని చూడటానికి ఆసుపత్రికి చేరుకున్న మహేష్ బాబు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Big Breaking : సూపర్ స్టార్ కృష్ణ ని చూడటానికి ఆసుపత్రికి చేరుకున్న మహేష్ బాబు..!!

Big Breaking : సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పాటు కొద్దిగా గుండెకు సంబంధించి కూడా అనారోగ్యం .. ఉన్న క్రమంలో ఒక్కసారిగా సీరియస్ కావడంతో… ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారంట. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో కృష్ణకి చికిత్స అందిస్తున్నారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసుపత్రికి చేరుకున్నారు. మహేష్ తో పాటు కుటుంబ సభ్యులంతా హాస్పిటల్ వద్దనే ఉన్నారు. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :14 November 2022,1:00 pm

Big Breaking : సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పాటు కొద్దిగా గుండెకు సంబంధించి కూడా అనారోగ్యం .. ఉన్న క్రమంలో ఒక్కసారిగా సీరియస్ కావడంతో… ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారంట. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో కృష్ణకి చికిత్స అందిస్తున్నారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసుపత్రికి చేరుకున్నారు. మహేష్ తో పాటు కుటుంబ సభ్యులంతా హాస్పిటల్ వద్దనే ఉన్నారు.

అర్ధరాత్రి కృష్ణకి గుండెపోటు రావడంతో… మహేష్ భార్య నమ్రత హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే కృష్ణకి సిపిఆర్ చేసి ఐసియులో పెట్టడం జరిగింది. ఈ క్రమంలో కృష్ణకి సంబంధించి మరికాసేపట్లో హెల్త్ బుల్లెట్ వైద్యులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద కొడుకు రమేష్ బాబు మరణించడం తర్వాత భార్య ఇందిరా దేవి తుది శ్వాస గడవడంతో కృష్ణ గత కొన్ని రోజులుగా కృంగిపోయి…

mahesh Babu reaches the hospital to see krishna

mahesh Babu reaches the hospital to see krishna

తీవ్రంగా అనారోగ్యానికి గురైనట్లు.. అర్ధరాత్రి సీరియస్ కావటంతో ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగిందట. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు. మరోపక్క కృష్ణ ఆరోగ్య పరిస్థితి పై నటుడు నరేష్ స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది ఈ రోజు సాయంత్రం వైద్యులు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతోనే హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు పేర్కొన్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది