Mahesh Babu : డైరెక్టర్ శంకర్ సినిమా ఆఫర్‌ను కాదన్న మహేశ్ బాబు.. ఎందుకంటే?
Mahesh Babu : కోలివుడ్ దర్శకుడు శంకర్ గురించి తెలియని వారుండరు. ఆయన సినిమాలు భారీ స్థాయిలో ఉండటమే అందుకు కారణం. దేశంలో పలు సినిమా పరిశ్రమల్లో ఎవరూ టెక్నాలజీని వినియోగించని సమయంలోనే సూపర్ స్ఠార్ రజినీ కాంత్‌తో రోబో సినిమా తీసి ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లిన ఘనత శంకర్‌కే దక్కుతుంది. ఆయన ప్రతీ సినిమా గ్రాండ్‌గా ఉండాలని భావిస్తారట.. ఆయన తీసే సినిమాలకు ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకు నిర్మాతలు వెనకాడరంటే అర్థం చేసుకోవచ్చు శంకర్ స్టామినా..
Mahesh Babu : ఆ రోల్ సెట్ అవ్వదనే వద్దన్నాడా?
శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ఆర్సీ 15 సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అంతేకాకుండా కమల్ హాసన్‌తో ఇండియన్ -2 సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఆ సినిమా 70 శాతం చిత్రీకరణ పూర్తవ్వగా నిర్మాతలతో విబేధాల కారణంగా ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది. దర్శకుడు శంకర్ తన తొలి సినిమా జెంటిల్‌మెన్ నుంచి ఇప్పటివరకు అన్ని సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించాడు. ఐ (మనోహరుడు) మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.మేకింగ్ పరంగా సత్తా ఉన్నా స్టోరీ పరంగా దెబ్బతినడంతో ఆ సినిమా ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది.
Mahesh Babu reject directer shankar movie offer
అయితే, మహేశ్ బాబు దర్శకుడు శ్రీనువైట్లతో దూకుడు సినిమా చేస్తున్న సమయంలో స్నేహితుడు మూవీలో మెయిన్ రోల్ కోసం శంకర్ మహేశ్‌ను సంప్రదించాడట.. ఆ సినిమా బాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీ అయిన త్రి ఇడియట్స్. అమీర్ ఖాన్ చేసిన రోల్ కోసం మహేశ్ ను సంప్రదించగా.. తనకు సెట్ అవ్వదనే కారణంతో మహేశ్ బాబు ఆ ఆఫర్ ను తిరస్కరించినట్టు పేర్కొన్నాడు.ఇదే విషయాన్ని దర్శకుడు శ్రీనువైట్లకు కూడా చెప్పినట్టు మహేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
