Pushpa Movie : పుష్ప మూవీని మొద‌ట రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. ఇప్పుడు అయ్యో అని త‌ల‌ ప‌ట్టుకుంటున్న మహేష్ ..!

Authored By Breaking News | The Telugu News | Published on: August 25, 2023, 3:00 pm

Pushpa Movie : కేంద్ర ప్రభుత్వం తాజాగా చలనచిత్ర రంగానికి సంబంధించి జాతీయ అవార్డుల ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో “పుష్ప” సినిమాకి రెండు అవార్డులు వర్రించాయి. 2021వ ఏడాదికి సంబంధించి “పుష్ప” సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ వసమయింది. ఇదే సమయంలో “పుష్ప” మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కి కూడా అవార్డు వరించింది. ఇదిలా ఉంటే అసలు “పుష్ప” స్టోరీ మొట్టమొదట డైరెక్టర్ సుకుమార్.. మహేష్ బాబుకి వినిపించినట్లు అప్పట్లో వార్తలు రావడం తెలిసిందే.

“సరిలేరు నీకెవరు” సినిమా తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. అయితే ఆ సమయంలో మహేష్ చేద్దామని అనుకున్న “పుష్ప” మూవీని చివరిలో రిజెక్ట్ చేసినట్లు టాక్. సరిగ్గా అదే స్టోరీని బన్నీకి చెప్పి ఒప్పించి..పాన్ ఇండియా స్థాయిలో సుకుమార్ భారీ హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప సినిమాకి జాతీయ అవార్డు రావడంతో పాటు ఉత్తమ జాతీయ అయినటువంటి అవార్డు బన్నీకి రావటం సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది.

Mahesh Babu reject pushpa movie

Mahesh Babu reject pushpa movie

ఈ క్రమంలో మహేష్ బాబు అభిమానులు తాజాగా ఈ విషయంపై చర్చలు చేస్తూ మహేష్ “పుష్ప” సినిమా చెయ్యకపోవటం మంచిదే అని అంటున్నారు. ఎందుకంటే “పుష్ప” సినిమా ఫుల్ మాస్ రోల్. కాబట్టి ఆ ఫ్లేవర్ కంటెంట్ మహేష్ బాబు ఇమేజ్ కి అసలు ఏ మాత్రం సెట్ అవ్వదు. మహేష్ చేయకుండా ఆ సినిమాని అల్లు అర్జున్ చేయడం వందకి 100% కరెక్ట్. “పుష్ప” స్టోరీకి తగ్గ హీరో అల్లు అర్జున్ ఒక్కరే. అందుకే అతనికి జాతీయ అవార్డు వరించింది అంటూ మహేష్ ఫ్యాన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp