Mahesh Babu : బాలయ్య కూతురిని మహేష్ బాబు రిజెక్ట్ చేశాడా.. అంత జరిగిందా?
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నాడు. ఆయన సినిమాలు మంచి విజయాలు సాధిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. చివరిగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించిన మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఇక మహేష్ బాబు సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తూ ఉంటాడు. మంచి భర్త, గొప్ప తండ్రి అనడంలో సందేహం లేదు. సినిమా తర్వాత కుటుంబమే ఆయన ప్రపంచం. ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతో విదేశాలకి చెక్కేస్తూ అక్కడ సరదాగా గడుపుతుంటారు.
2005లో నమ్రతను మహేష్ బాబు రహస్య వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ఉన్నప్పటికీ మహేష్ పెళ్లి విషయం మీడియాకు తెలియకుండా అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా మహేష్ బాబు వివాహం చేసుకున్నారు. ఇక వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సితార ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. గౌతమ్ కూడా అడపాదడపా వార్తలలో నిలుస్తూనే ఉంటాడు. ఇక మహేష్ బాబు హీరోగానే కాకుండా మంచి మనసు ఉన్న మనిషిగా కూడా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. గుండె జబ్బుల బారిన పడిన చిన్నారులకు ఆపరేషన్ చేయిస్తున్నారు. రెండు గ్రామాలు దత్తత తీసుకుని మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నా రు.
Mahesh Babu : బాలయ్య కూతురిని మహేష్ బాబు రిజెక్ట్ చేశాడా.. అంత జరిగిందా?
అయితే మహేష్ బాబు.. బాలకృష్ణ పెద్దమ్మాయి బ్రాహ్మణిని వివాహం చేసుకోవాల్సిందట. వరుస హిట్స్ తో సూపర్ స్టార్ గా ఎదుగుతున్న మహేష్ బాబును బాలకృష్ణ అల్లుడిగా చేసుకోవాలని అనుకున్నారట. ఇదే విషయం మహేష్ తో బాలకృష్ణ మాట్లాడారట. మహేష్ సున్నితంగా బాలకృష్ణ ప్రపోజల్ ని తిరస్కరించాడట. అప్పటికే మహేష్ బాబు హీరోయిన్ నమ్రతతో ప్రేమలో ఉండటం వలన బ్రాహ్మణిని మహేష్ బాబు చేసుకోనని ఖరాఖండీగా చెప్పేశాడట. .దాంతో బాలకృష్ణ తన కుమార్తె బ్రాహ్మణిని మేనల్లుడు లోకేష్ కి యిచ్చి వివాహం చేశాడు. మహేష్ పెళ్లి అయిన రెండేళ్లకి నారా లోకేష్- బ్రాహ్మణిల వివాహం జరగడం మనం చూశాం.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.