Mahesh Babu : సీక్రేట్ గా మహేశ్ బాబు మ్యారేజ్.. కారణం ఏంటంటే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : సీక్రేట్ గా మహేశ్ బాబు మ్యారేజ్.. కారణం ఏంటంటే..

 Authored By mallesh | The Telugu News | Updated on :5 February 2022,4:30 pm

Mahesh Babu : మహేశ్ బాబు ఎందుకు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని చాలా మందికి ఇంకా డౌట్ ఉంది. ఒక అకేషన్ కు వెళ్లిన సూపర్ స్టార్ మహేశ్.. ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చారు. ఈ విషయాన్ని చాలా మంది ఆయన్ను అడగాలని చూసినా ఆయన నుంచి ఆన్సర్ రాలేదు. ఏ యాంకర్ సైతం ఆ విషయాన్ని అడిగేందుకు ధైర్యం చేయలేదు. కానీ తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా వచ్చాడు మహేశ్. ఈ క్రమంలో మహేశ్ మ్యారేజ్ గురించి బాలయ్య అడిగేశాడు. ఇందుకు మహేశ్ నవ్వుతూ ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం జరిగిన విషయం అది అంటూ చెప్పుకొచ్చాడు.

అనుకోకుండా అలా జరిగిపోయింది. అయితే వంశీ మూవీ టైంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారట. కానీ ఈ విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదట. ఆయన్ను ఒప్పించేందుకు టైం పట్టిందటని చెప్పాడు మహేశ్. అలా వీరి లవ్ స్టోరీకి గ్రీన్ కార్డు పడింది.2005 ఫిబ్రవరి 10న మహేశ్ బాబు, నమ్రత పెళ్లి చేసుకున్నారు. చెప్పకుండా పెళ్లి చేసుకునే సరికి వారి దొంగపెళ్లి అని ప్రచారం జరిగిందట.అయితే అందులో వాస్తవం లేదని, ప్రైవేట్ గానే పెళ్లి చేసుకోవాలని వారు అనుకున్నారట.

mahesh babu reveals about secret marriage

mahesh babu reveals about secret marriage

Mahesh Babu : అందుకే ప్రైవేట్‌గా పెళ్లి

అందుకే ఎవరికీ చెప్పకుండా చేసుకున్నట్టు సమాధానమిచ్చాడు మహేశ్.. ఇక మ్యూరేజ్ తర్వాత మూవీలకు దాదాపుగా దూరంగానే ఉంది నమ్రత. జంట అంటే ఇలా ఆదర్శంగా ఉండాలే నిలిచారు మహేశ్, నమ్రత. ప్రస్తుతం మహేశ్ సర్కారు వారి పాట మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీపై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేశ్ బాబుకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇందులో మహేశ్ మరింత స్టైలిష్ గా కనిపించారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది