Mahesh Babu : మహేశ్ బాబు ఎందుకు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని చాలా మందికి ఇంకా డౌట్ ఉంది. ఒక అకేషన్ కు వెళ్లిన సూపర్ స్టార్ మహేశ్.. ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చారు. ఈ విషయాన్ని చాలా మంది ఆయన్ను అడగాలని చూసినా ఆయన నుంచి ఆన్సర్ రాలేదు. ఏ యాంకర్ సైతం ఆ విషయాన్ని అడిగేందుకు ధైర్యం చేయలేదు. కానీ తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా వచ్చాడు మహేశ్. ఈ క్రమంలో మహేశ్ మ్యారేజ్ గురించి బాలయ్య అడిగేశాడు. ఇందుకు మహేశ్ నవ్వుతూ ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం జరిగిన విషయం అది అంటూ చెప్పుకొచ్చాడు.
అనుకోకుండా అలా జరిగిపోయింది. అయితే వంశీ మూవీ టైంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారట. కానీ ఈ విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదట. ఆయన్ను ఒప్పించేందుకు టైం పట్టిందటని చెప్పాడు మహేశ్. అలా వీరి లవ్ స్టోరీకి గ్రీన్ కార్డు పడింది.2005 ఫిబ్రవరి 10న మహేశ్ బాబు, నమ్రత పెళ్లి చేసుకున్నారు. చెప్పకుండా పెళ్లి చేసుకునే సరికి వారి దొంగపెళ్లి అని ప్రచారం జరిగిందట.అయితే అందులో వాస్తవం లేదని, ప్రైవేట్ గానే పెళ్లి చేసుకోవాలని వారు అనుకున్నారట.
అందుకే ఎవరికీ చెప్పకుండా చేసుకున్నట్టు సమాధానమిచ్చాడు మహేశ్.. ఇక మ్యూరేజ్ తర్వాత మూవీలకు దాదాపుగా దూరంగానే ఉంది నమ్రత. జంట అంటే ఇలా ఆదర్శంగా ఉండాలే నిలిచారు మహేశ్, నమ్రత. ప్రస్తుతం మహేశ్ సర్కారు వారి పాట మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీపై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేశ్ బాబుకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇందులో మహేశ్ మరింత స్టైలిష్ గా కనిపించారు.
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.