Mahesh Babu Son In Law : ఆ న‌డ‌క, ఆ స్టైల్ అచ్చం మ‌హేష్ బాబు మాదిరిగానే.. ఎవ‌రు ఇత‌ను అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu Son In Law : ఆ న‌డ‌క, ఆ స్టైల్ అచ్చం మ‌హేష్ బాబు మాదిరిగానే.. ఎవ‌రు ఇత‌ను అంటే..!

Mahesh Babu Son In Law : ఘట్టమనేని అల్లుడు, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న త‌న టాలెంట్‌తో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. హీరో సుధీర్ బాబుకు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు చరిత్ మానస్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. అతను చూడ్డానికి అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా కనిపిస్తాడు.. వాకింగ్ స్టైల్ కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 June 2024,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Mahesh Babu Son In Law : ఆ న‌డ‌క, ఆ స్టైల్ అచ్చం మ‌హేష్ బాబు మాదిరిగానే.. ఎవ‌రు ఇత‌ను అంటే..!

Mahesh Babu Son In Law : ఘట్టమనేని అల్లుడు, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న త‌న టాలెంట్‌తో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. హీరో సుధీర్ బాబుకు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు చరిత్ మానస్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. అతను చూడ్డానికి అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా కనిపిస్తాడు.. వాకింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. తన మేనమామ పోలికలు ఎక్కువగా ఉండటంతో అతడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. చరిత్ అచ్చం మహేష్ బాబు లాగే కనపడటం, మహేష్ మేనరిజమ్స్ చరిత్ లో కనిపించడంతో ఇప్పటికే పలుమార్లు మేనమామ పోలికలు బాగా వచ్చాయి అని అనుకున్నారు.

Mahesh Babu Son In Law మేన‌మామ పోలిక‌లు..

ఇక చరిత్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా గతంలో సుధీర్ బాబు సినిమాలోనే చేసాడు. మహేష్ ఫ్యాన్స్ కూడా చరిత్ ని చూస్తుంటే మహేష్ గుర్తుకు వస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సుధీర్ బాబు కూడా మంచిదే కదా అని అన్నాడు కూడా.ఇక చరిత్ భవిష్యత్తులో సినిమాల్లోకి కూడా రావొచ్చు అని సుధీర్ బాబు గతంలోనే తెలిపాడు. అయితే తాజాగా మరోసారి మహేష్ మేనల్లుడు చరిత్ వైరల్ అవుతున్నాడు. సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర రిలీజయింది. ఈ సినిమాకి చూడటానికి చరిత్ తన ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ లోని AMB మాల్ కి వెళ్ళాడు. అక్కడ చరత్ నడుస్తూ వెళ్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో చరిత్ అచ్చంగా మేనమామ మహేష్ బాబు నడుస్తున్నట్టే క‌నిపించ‌డంతో అచ్చం మేన‌మామ మేన‌రిజం పుణికిపుచ్చుకున్నాడు క‌దా అని కామెంట్ చేస్తున్నారు.

Mahesh Babu Son In Law ఆ న‌డ‌క ఆ స్టైల్ అచ్చం మ‌హేష్ బాబు మాదిరిగానే ఎవ‌రు ఇత‌ను అంటే

Mahesh Babu Son In Law : ఆ న‌డ‌క, ఆ స్టైల్ అచ్చం మ‌హేష్ బాబు మాదిరిగానే.. ఎవ‌రు ఇత‌ను అంటే..!

ఇన్నాళ్లు పోలికలు ఉన్నాయి, మేనరిజమ్స్ ఉన్నాయి అనుకున్నారు. ఇప్పుడు చరిత్ వాకింగ్ స్టైల్ కూడా అచ్చం మహేష్ బాబులా ఉండటంతో ఆశ్చర్యపోతూనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందంలో కూడా మేనమామకు పోటీగా వస్తున్నాడు ఈ అల్లుడు. చరిత్ మానస్ వయస్సు ఇప్పుడు 16 ఏళ్ళని, ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది