Home » Entertainment » Mahesh Babu Success Formula Is Known By Every One
Entertainment

మహేష్ బాబు సక్సస్ ఫార్ములా తెలిసిపోయింది… ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ అందరూ ఫాలో అవుతారేమో ..?

Authored By
vamana sai
The Telugu News | Published on: December 25, 2020, 5:57 pm
Advertisement

మహేష్ బాబు గత కొంతకాలంగా వరసగా బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. చెప్పాలంటే టాలీవుడ్ లో ఇన్ని సక్సస్ లు అందుకున్నట్టు మరే హీరో అందుకోలేదనే చెప్పాలి. దాదాపు 3-4 ఏళ్ళ నుంచి మహేష్ బాబు ఖాతాలో భారీ కమర్షియల్ హిట్స్ పడుతున్నాయి. అయితే ఇలా మహేష్ బాబు కంటిన్యూస్ గా హిట్స్ రావడానికి కారణం ఏంటని చాలా మంది అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కూడా మహేష్ బాబు లాగానే వరసగా హిట్స్ అందుకుంటూ ఖాన్ ల త్రయాన్ని వెనక్కి నెట్టాడు. ఇక మహేష్ బాబు టాలీవుడ్ లో ఇలా వరసగా హిట్స్ అందుకొని సక్సస్ ల పరంగా నంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు.

Advertisement

బాహుబలి లాంటి పాన్ ఇండియన్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కూడా ఆ తర్వాత వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ సాహో తో ఫ్లాప్ చూశాడు. కాని మహేష్ బాబు మాత్రం ఫ్లాప్ అన్నది రాకుండా ఎంతో జాగ్రత్తపడుతున్నాడు. ఇదే సక్సస్ ని త్వరలో మొదలవబోయే సర్కారు వారి పాట సినిమాకి కంటిన్యూ చేస్తాడని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారట. పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా జనవరి నుంచి సర్కారు వారి పాట సెట్స్ మీదకి వెళ్ళబోతోంది.

Advertisement

జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. 14 రీల్స్ ప్లస్ .. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యూనివర్సల్ పాయింట్ తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఇంకా షూటింగ్ కూడా మొదలవని సర్కారు వారి పాట ఇప్పటి నుంచే హిట్ అని చెప్పుకోవడానికి కారణం దర్శకుడు పరశురాం అంటున్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబు మంచి ఫాం అండ్ సక్సస్ లో ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందుకే కొరటాల శివ తో రెండు హిట్స్, వంశీ పైడిపల్లి తో ఒక హిట్, అనిల్ రావిపూడి తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఒక హిట్ ని అందుకున్నాడు. వీళ్ళంతా కొత్త దర్శకులు. వాళ్ళలో కసి బాగా ఉంటుంది. అందుకే మహేష్ ఆ లాజిక్ ని గట్టిగా పట్టుకున్నాడు. హిట్స్ కొడుతున్నాడు. ఇప్పుడు ఇదే లాజిక్ మన టాలీవుడ్ హీరోలకి అర్థమైతే ఖచ్చితంగా సినిమాల ఎంపికలో మహేష్ బాబు నే ఫాలో అవుతారేమో చూడాలి.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి