Mahesh Babu : మ‌ళ్లీ టూర్.. ఇలా తిరిగితే సితార చ‌దువు ఏమై పోవాల‌య్యా మ‌హేషా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : మ‌ళ్లీ టూర్.. ఇలా తిరిగితే సితార చ‌దువు ఏమై పోవాల‌య్యా మ‌హేషా?

 Authored By sandeep | The Telugu News | Updated on :21 July 2022,8:00 pm

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తుంటాడు. ఖాళీ దొరికిందంటే ఎటోక‌టు టూర్స్ వేస్తూనే ఉంటాడు. మహేష్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. అయినా కూడా ఆయన సినిమాల్లో 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటాడు. ఇక మహేష్‌ను చూసిన వారంతా ఏం తింటున్నావు… అంటూ ఆయనను ప్రశ్నలు అడుగుతుంటారు. ఇంత అందాన్ని ఎలా మెంటైన్ చేస్తున్నావంటూ.. మహేష్‌ను చాలామంది ఇప్పటికే అడిగిన విషయం కూడా తెలిసిందే. ఎంతో యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్గా ఉండే మ‌హేష్ కొద్ది రోజులుగా తెగ విహార‌యాత్ర‌ల‌కు వెళుతున్నాడు.

Mahesh Babu : టూర్ వెనుక సీక్రెట్..

మహేష్ బాబు కొద్ది రోజులుగా వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. “సర్కారు వారి పాట” సినిమా సక్సెస్ తో మరింత ఎనర్జిటిక్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు మహేష్ ఈ బ్రేక్ లో ఉండగా ఈ సమయాన్ని తన ఫ్యామిలీ తో ఎంతో ఆహ్లాదంగా గడుపుతున్నారు.అయితే ఇటీవ‌ల త‌న ట్రిప్ ముగించుకొని హైద‌రాబాద్‌కి వ‌చ్చిన మ‌హేష్ ఈ రోజు త‌న సతీమ‌ణితో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో క‌నిపించాడ‌ట‌. మ‌ళ్లీ టూర్ ఎటు వేస్తున్నాడ‌ని అంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ట్రిప్ వెనుక ఒక కారణం కూడా ఉందని తెలుస్తోంది. గత కొంతకాలంగా మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని కోసం ఫారిన్ లో మంచి స్కూల్స్ ను వెతుకుతున్నారు.

mahesh babu tour for goutham

mahesh babu tour for goutham

ఈ నేపథ్యంలోని మహేష్ బాబు మరియు తన భార్య నమృత కలిసి అమెరికాలో పెద్ద స్కూల్ లో జాయిన్ చేయించ‌బోతున్నార‌ట‌.ఒక‌ ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు కూడా అదే స్కూల్లో చదువుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈటూర్ గౌత‌మ్ కోసం అని తెలుస్తుంది. అయితే ఇలా వ‌రుస టూర్స్ వేస్తే సితార చ‌దువు ఏమై పోతుంద‌ని కొంద‌రు అభిమానులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. న‌మ్ర‌త రీసెంట్‌గా ప‌ద‌వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది