Home » Entertainment » Mahesh Babu Voice Over For Hollywood Movie Mufasa The Loin King
Entertainment

Mahesh Babu : రాజమౌళి సినిమాకు ముందే హాలీవుడ్ కి పరిచయం అవుతున్న మహేష్ బాబు…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: August 22, 2024, 9:00 am
Advertisement

Mahesh Babu : యానిమేషన్ సీరీస్ లు సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. హాలీవుడ్ లో వీటి డిమాండ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే అక్కడ పెద్ద పెద్ద సంస్థలు యానిమేషన్ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తాయి. ముఖ్యంగా డిస్నీ వారు అయితే ఇలాంట్ వాటికి ముందుంటారు. ఈ క్రమంలోనే ది లయన్ కింగ్ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. లయన్ కింగ్ సినిమా కు భారత్ లో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే దానికి సీక్వెల్ గా వస్తున్న ది లయన్ కింగ్ 2 కోసం భారీ హైప్ తెస్తున్నారు. ఇందుకోసం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబునే రంగంలోకి దించుతున్నారు. లయన్ కింగ్ సినిమాలో తండ్రి పాత్రలో ముఫాసా పాత్రలో సిం హం ఉంటుంది. దానికి సూపర్ స్టార్ మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఇదే విషయాన్ని మహేస్ వెల్లడించారు. లయన్ కింగ్ లో ముఫాసాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని తెలియడంతోనే ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు.

Advertisement

Mahesh Babu ఇదివరకు నాని కూడా..

లయన్ కింగ్ సినిమా ఎప్పుడో వచ్చినా దాన్ని మళ్లీ 3 ఏళ్ల క్రితం తెరకెక్కించారు. అప్పుడు నాని కూడా దాని ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు ఏకంగా మహేష్ ముఫాసాకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఇప్పటికే తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో హాలీవుడ్ రేంజ్ సినిమా అటెంప్ట్ చేస్తున్న మహేష్ దానికి ముందు హాలీవుడ్ సినిమాకు పనిచేయడం అది కూడా ఒక యానిమేటెడ్ సీరీస్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడం గొప్ప విషయమని చెప్పొచ్చు.

Mahesh Babu : రాజమౌళి సినిమాకు ముందే హాలీవుడ్ కి పరిచయం అవుతున్న మహేష్ బాబు…!

Advertisement

కచ్చితంగా మహేష్ బాబు వాయిస్ ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐతే ముఫాసా కి మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అంటే దానికి మహేష్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటాడని అంటున్నారు. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ ఈ నెల 26న ఉదయం 11:07 గంటలకు రిలీజ్ లాక్ చేశారు. ట్రైలర్ కి మహేష్ డబ్బింగ్ ఇస్తున్నాడని తెలిసి సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ముఫాసా ది లయన్ కింగ్ లో మన సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ ఎలా ఉంటుందో చూడాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి