Home » Entertainment » Mahesh Babu Work Out Video Viral
Entertainment

Mahesh Babu : మ‌హేష్ బాబు బ్యూటీ సీక్రెట్ ఇదేనా.. ఇంత క‌ష్ట పడాలా వీడియో..?

Authored By
Sam C
The Telugu News | Published on: February 28, 2022, 6:30 pm
Advertisement

Mahesh Babu:సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మిల్కీ బాయ్‌గా అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన విష‌యం తెలిసిందే. ఐదు ప‌దుల వ‌యస్సులోను త‌న స్మార్ట్‌నెస్‌తో ఆక‌ట్టుకుంటాడు. ఇప్ప‌టికీ మ‌హేష్ బాబు అమ్మయిల క‌ల‌ల రాకుమారుడు అన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే .ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ స్టైలీష్ లుక్‏లో కనిపించనుండడంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది.ఇప్పటికే స‌ర్కారు వారి పాట‌ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, వీడియోస్ సర్కారు వారి పాట చిత్రంపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా తర్వాత మహేష్.. త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో చిత్రాలు చేయనున్నారు. ఈ వ‌య‌స్సులోను మ‌హేష్ బాబు ఎంతో జోష్‌గా సినిమలు చేస్తున్నారు.

Advertisement

అయితే ఫిట్‌నెస్‌కి ప్రాధాన్య‌త ఇచ్చే మ‌హేష్ తాజాగా జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చిది. ఇందులో మ‌హేష్ బాబు తెగ క‌ష్ట‌ప‌డుతూ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. మ‌హేష్ బ్యూటీ సీక్రెట్ ఇదేనా అంటూ ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు.మ‌హేష్ న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట సినిమాకు చెందిన సంగీత ప్రమోషన్‌లు విపరీతమైన ఆదరణతో ప్రారంభించబడ్డాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కళావతి లిరికల్ వీడియో అద్భుతమైన స్పందనను పొందింది. రీసెంట్‌గా విడుద‌లైన క‌ళావ‌తి సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో 50 మిలియన్ మార్క్‌ను చేరుకుంది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 50 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి సింగిల్ ఇది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన ఈ పాట అన్ని మ్యూజిక్ అప్లికేషన్‌లలో మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఎస్ తమన్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ పాట పాడగా, అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు.

mahesh babu work out video

Advertisement

Mahesh Babu : ఏం క‌ష్ట‌ప‌డుతున్నాడురా బాబు..

సంగీత ప్రియులు ఈ పాటపై తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. నెటిజన్లు మేకింగ్ విధానాన్ని మెచ్చుకుంటూ తమ ప్రేమను చాటుకుంటున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి