Mahesh babu : శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh babu : శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని..!

 Authored By mallesh | The Telugu News | Updated on :2 December 2021,5:00 pm

Mahesh babu : శిల్పా చౌదరి వారం రోజుల నుంచి టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఈ కిలేడీ వలన అనేక మంది తమ ఆస్తులను కోల్పోయారు. చాన్నాళ్ల నుంచే ఈ కిలేడీ కిరాతకాలు చేస్తున్నా కానీ పాపం పండి రీసెంట్ గా పోలీసులకు చిక్కింది. ఈ లేడీని అరెస్ట్ చేశాక ఆమె చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇలా ఈ మోసగత్తె చేతిలో చాలా మంది సెలబ్రెటీలు పడ్డారు. ఇప్పుడు వారంతా ఒక్కొక్కరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయన అందం ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ తగ్గడం లేదు. ఆయన వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా తయారవుతున్నాడని చాలా మంది ఆయన అభిమానులు చెబుతున్నారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బయట కూడా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ మహేశ్ అంటే చాలా మంది లేడీ ఫ్యాన్స్ పడి చస్తారు. అటువంటి మహేశ్ బాబు సోదరి కూడా శిల్పా చౌదరి చేతిలో మోసపోయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించింది. ఇలా శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన వారి జాబితా రోజురోజుకూ పెరుక్కుంటూ పోతుంది.

Mahesh babur sister cheated on by shilpa chaudhary

Mahesh babur sister cheated on by shilpa chaudhary

Mahesh babu : మహేశ్ సోదరి కూడా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి కూడా ఈ కిలేడీ చేతిలో మోసపోయిందట. తాను కూడా శిల్పా చౌదరి చేతిలో తాను కూడా మోసపోయానని మహేశ్ సోదరి ప్రియదర్శిని ఈ రోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. శిల్పా చౌదరి తన వద్ద రెండు కోట్ల రూపాయలను తీసుకుని ఇవ్వలేదని వాపోయింది. ఇప్పటికే శిల్పా చౌదరి మీద 90 మంది వరకు సెలబ్రెటీలు ఫిర్యాదు చేశారు. మరింత మంది కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. శిల్పా చౌదరి దినావాస్ పేరుతో పేకాట క్లబ్ నిర్వహిస్తుందని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. శిల్పా చౌదరి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది