
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లోకి మహేష్ బాబు రిలేటివ్.. ఇక రచ్చ రంబోలానే..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ప్రవేశించారు. ఈసారి పెద్దగా పేరున్న నటులు లేరు ఎవరు లేకపోగా విష్ణుప్రియ, ఆదిత్య ఓం, అభయ్ నవీన్… ఇలా ఒకరిద్దరు మాత్రమే తెలిసిన ముఖాలతో అలా నడిపిస్తున్నారు. నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్విరాజ్ వంటి సీరియల్ స్టార్స్‌ని ఇందులోకి తీసుకోగా వారంతా కన్నడ బ్యాచ్. ఈ క్రమంలో సీజన్ 7 స్థాయిలో సీజన్ 8 లేదనేది గట్టిగా వినిపిస్తున్న మాట. అందుకు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా కారణం. బిగ్ బాస్ మేకర్స్ కి కంటెస్టెంట్స్ కొరత ఉందనిపిస్తుంది. లక్షలు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నా… కొందరు సెలబ్రిటీలు ముందుకు రావడం లేదు. బిగ్ బాస్ షో వలన పాజిటివ్ కంటే నెగిటివ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని భావిస్తున్నారు.
బిగ్ బాస్ షో అన్ని భాషలలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఎనిమిదోవ సీజన్ ప్రసారం అవుతుంది. కానీ బాలీవుడ్ లో మాత్రం 18 సీజన్ మొదలు కాబోతుంది. ఈ షో కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ లో ఎవరు పాల్గొంటారా అని తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నారు. అక్కడ జరగబోతున్న షోలో మహేష్ బాబు రిలేటివ్ ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ కు సోదరి అయిన శిల్ప ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. నమ్రతా లాగే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది శిల్ప. భ్రష్టాచార్(1989) సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన శిల్ప.. కిషన్ కన్హయ్య, త్రినేత్ర, హమ్, ఖుదా గవా, ఆంఖెన్, గోపి కిషన్, మృత్యునాద్, బేవఫ సనం ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో మోహన్ బాబు సరసన బ్రహ్మ అనే సినిమాలో కథానాయికగా నటించింది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లోకి మహేష్ బాబు రిలేటివ్.. ఇక రచ్చ రంబోలానే..!
తాజాగా హిందీ బిగ్ బాస్ సీజన్ 18 కు చెందిన ప్రోమోని విడుదల చేసారు. అలాగే ఈ సీజన్ అక్టోబర్ 6 నుంచి మొదలు కాబోతుందని అధికారికంగా తెలిపారు. ఎప్పుడూ సెన్సేషనల్ అవుతూ వార్తల్లో నిలిచే హిందీ బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ ఈ సారి ఎవరు వస్తారో చూడాలి.. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సీజన్ లోకి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత అక్క శిల్ప శిరోద్కర్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్.. అందులో నిజమేంత ఉందో తెలియదు ఈ వార్త మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వార్తే నిజమైతే విన్నర్ ఆమె అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.