Mahesh Babu : డ్యుయల్ రోల్ లో మహేష్.. బాక్సాఫీస్ ని చేసేందుకు డబుల్ ధమాకా ప్లాన్ చేసిన జక్కన్న..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu : డ్యుయల్ రోల్ లో మహేష్.. బాక్సాఫీస్ ని చేసేందుకు డబుల్ ధమాకా ప్లాన్ చేసిన జక్కన్న..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇద్దరు కలిసి కొన్నళ్లుగా సినిమా చేయాలని అనుకుంటున్నారు కానీ అది ఇన్నాళ్లకు కుదిరింది. గుంటూరు కారం తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి అడిగిన రోజులు డేట్స్ ఇచ్చేందుకు మహేష్ సిద్ధమయ్యాడు. రాజమౌళితో సినిమా అంటే తక్కువలో తక్కువ 3 ఏళ్లు అయినా ఇవ్వాల్సిందే. మహేష్ రాజమౌళి సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా వస్తుందని అంటున్నారు. ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Mahesh Babu : డ్యుయల్ రోల్ లో మహేష్.. బాక్సాఫీస్ ని చేసేందుకు డబుల్ ధమాకా ప్లాన్ చేసిన జక్కన్న..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇద్దరు కలిసి కొన్నళ్లుగా సినిమా చేయాలని అనుకుంటున్నారు కానీ అది ఇన్నాళ్లకు కుదిరింది. గుంటూరు కారం తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి అడిగిన రోజులు డేట్స్ ఇచ్చేందుకు మహేష్ సిద్ధమయ్యాడు. రాజమౌళితో సినిమా అంటే తక్కువలో తక్కువ 3 ఏళ్లు అయినా ఇవ్వాల్సిందే. మహేష్ రాజమౌళి సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా వస్తుందని అంటున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు జక్కన్న. అందుకే సినిమా కోసం అక్కడ టెక్నిషియన్స్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక సినిమా బడ్జెట్ కూడా 1000 కోట్ల దాకా పెడుతున్నారన్న వార్త ఐతే హల్ చల్ చేస్తుంది.

Mahesh Babu మహేష్ ఒక్కడు కాదా

ఇక ఈ సినిమా నుంచి ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. సినిమాలో మహేష్ ఒక్కడు కాదు ఇద్దరట. అంటే సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ పూర్తి స్థాయిలో మేకోవర్ ఉంటుందని టాక్. ఇప్పటికే సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ గడ్డం పెంచుకుంటున్నాడు. మహేష్ ని ఇదివరకు ఎప్పుడూ చూడని కొత్త లుక్ లో రాజమౌళి చూపించనున్నాడని తెలుస్తుంది.

Mahesh Babu డ్యుయల్ రోల్ లో మహేష్ బాక్సాఫీస్ ని చేసేందుకు డబుల్ ధమాకా ప్లాన్ చేసిన జక్కన్న

Mahesh Babu : డ్యుయల్ రోల్ లో మహేష్.. బాక్సాఫీస్ ని చేసేందుకు డబుల్ ధమాకా ప్లాన్ చేసిన జక్కన్న..!

మహేష్ రాజమౌళి సినిమాలో మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమార్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా లో కాస్టింగ్ కూడా భారీగా ఉండబోతుందని టాక్. త్వరలోనే మహేష్ కు సంబందించిన ఒక షో రీల్ అయితే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఇక సినిమా కోసం కొంత వర్క్ షాప్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. మరి ఎస్.ఎస్.ఎం.బి 29 నెవర్ బిఫోర్ అనిపించే రికార్డులు కొల్లగొట్టేలా రాజమౌళి ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండియ యాక్టర్ ని తీసుకుంటారా లేదా హాలీవుడ్ భామని ఎవరినైనా తీసుకుంటారా అన్నది చూడాలి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది