
Mallemala TRP Tricks On Sudigali Sudheer In Sridevi Drama Company
Sudigali Sudheer : బుల్లితెరపై సుధీర్‌కి ఉన్న ఫాలోయింగ్ వేరే లెవెల్. సుడిగాలి సుధీర్ అనేది ఒక బ్రాండ్‌లా మారిపోయింది. సుధీర్ ఉంటే చాలు ఆ షో హిట్ అనేంతగా తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే సుధీర్ రష్మీ జోడిని మల్లెమాల భారీగా వాడేసింది. ఆ ఇద్దరి మీద గతంలో ఎన్నో ఈవెంట్లను ప్లాన్ చేసింది. నిశ్చితార్థం, పెళ్లి, శోభనం అంటూ ఇలా ఇద్దరి మీద రకరకాల ఈవెంట్లు చేసింది. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.సుధీర్ రష్మీ జోడి అయిన తరువాత వర్ష ఇమాన్యుయేల్ అన్నారు..
ఆ తరువాత రాకేష్ రోహిణి అన్నారు.. ఇప్పుడు రాకేష్ సుజాత అంటున్నారు. మధ్యలో నరేష్ షబీనా అని కాస్త ఏదో ట్రై చేశారు. మొత్తానికి బుల్లితెరపై మాత్రం ఈ రొమాంటిక్ ట్రాక్, లవ్ ట్రాకులను బాగానే నడిపిస్తున్నారు. ఇక ఇప్పుడు సుధీర్ పెళ్లి మీదనే శ్రీదేవీ మల్లెమాల బాగా ఫోకస్ పెట్టేసినట్టు కనిపిస్తోంది.ఆ మధ్య సుధీర్ ఎంగేజ్మెంట్ అంటూ ఓ ప్రోమోను వదిలారు. తీరా ఆ షోలో చూస్తే అసలు విషయం బయటపడింది. ఓ నలుగురు అమ్మాయిలు సుధీర్ గురించి కలలు కంటారట.. అందులో సుధీర్ తనను పెళ్లి చేసుకున్నాడని కలలు కనేసింది. దీన్ని మనకు ప్రోమోలో వేసి చూపించారు.
Mallemala TRP Tricks On Sudigali Sudheer In Sridevi Drama Company
సుధీర్ ఎంగేజ్మెంట్ అంటూ ఇచ్చిన కలరింగ్ మామూలుగా లేదు. అదొక టీఆర్పీ స్టంట్ అని అందరూ కనిపెట్టేశారు. కానీ సుధీర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త నమ్మేశారు.మళ్లీ ఇప్పుడు సుధీర్ మీదనే మల్లెమాల ఆధారపడింది. తాజాగా వదిలిన ప్రోమోలో సుధీర్ తన ప్రేమ గురించి, తాను చేసుకోబోయే అమ్మాయి గురించి చెబుతున్నట్టుగా ప్రోమోను కట్ చేశారు. కానీ తీరా ఎపిసోడ్ చూస్తే మాత్రం అదేం ఉండదు. నిజంగానే సుధీర్ తాను చేసుకోబోయే అమ్మాయి పేరు చెప్పేస్తాడా? చూపించేస్తాడా? అని అందరూ తెగ ఎదురుచూస్తున్నట్టుగా ఆ ప్రోమో ఉంది.
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
This website uses cookies.