Sudigali Sudheer : పరోక్షంగా పిలుస్తున్నారా?.. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులకు మల్లెమాల సంకేతం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : పరోక్షంగా పిలుస్తున్నారా?.. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులకు మల్లెమాల సంకేతం

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు లేకపోతే ఎక్స్ ట్రా జబర్దస్త్ ఉండీ కూడా వేస్ట్. ఆ సంగతి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోకు హైపర్ ఆది.. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ ప్రాణం వంటివి. కానీ ఇప్పుడు ఆ రెండు టీంలు కూడా లేవు. దీంతో ఆ రెండు షోలు బిక్కు బిక్కు మంటున్నాయి. ఆది ఎందుకు వెళ్లాడో తెలియడం లేదు. ఇక గెటప్ శ్రీను, సుధీర్ సినిమా అవకాశాలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 June 2022,6:00 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు లేకపోతే ఎక్స్ ట్రా జబర్దస్త్ ఉండీ కూడా వేస్ట్. ఆ సంగతి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోకు హైపర్ ఆది.. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ ప్రాణం వంటివి. కానీ ఇప్పుడు ఆ రెండు టీంలు కూడా లేవు. దీంతో ఆ రెండు షోలు బిక్కు బిక్కు మంటున్నాయి. ఆది ఎందుకు వెళ్లాడో తెలియడం లేదు. ఇక గెటప్ శ్రీను, సుధీర్ సినిమా అవకాశాలు వస్తుండటంతో వెళ్లారని అంటున్నారు.కానీ సుధీర్ మాత్రం స్టార్ మాలో ఓ షో చేస్తున్నాడు. ఇక్కడ వదిలేసి అక్కడ ఎందుకు చేస్తున్నాడన్న దానికి సమాధానం లేదు.

అయితే ఆటో రాం ప్రసాద్ మాత్రం ఒంటిగానే లాగుతున్నాడు. స్కిట్లను ఒడ్డున చేర్చేందుకు ఈదుతూనే ఉన్నాడు. ఒక్కడే రాయడం ,చేయడం, స్కిట్లను నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు. మొత్తానికి రాం ప్రసాద్ మాత్రం ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడో ఆ విషయాన్ని రాకింగ్ రాకేష్ ఓ స్కిట్ రూపంలో బయట పెట్టేశాడు. ఇందులో సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శ్రీను పాత్రలను పోషించి.. స్టేజ్ మీద అందరినీ ఏడిపించేశారు. యాంకర్ రష్మీ, ఇంద్రజ, రాం ప్రసాద్ ఇలా అందరూ ఏడ్చేశారు. ఇక ఇంద్రజ అయితే తెగ ఎమోషనల్ అయింది. మళ్లీ త్వరలోనే మీ ముగ్గురూ కలిసి ఇక్కడ స్కిట్ చేయాలి.. అది చూసేందుకు నేను ఇక్కడ ఉండాలి..

Mallemala Wants Sudigali Sudheer and Getup Srinu To Come Back In Extra Jabardasth

Mallemala Wants Sudigali Sudheer and Getup Srinu To Come Back In Extra Jabardasth

ఇదే నేను ఆ దేవుడిని కోరుకునేది అంటూ ఇంద్రజ అనేసరికి అందరూ ఏడ్చేశారు. ఇక రాం ప్రసాద్ సైతం కంటతడి పెట్టేశాడు. తాను ఒంటరినయ్యాననిపిస్తోంది.. మిస్ యూ రా.. అని ఎమోషనల్ అయ్యాడు. అంటే పరోక్షంగా ఆ ఇద్దరిని రమ్మని పిలిచినట్టుగా ఈ స్కిట్ అనిపించింది. మల్లెమాల టీం ఆ సంకేతాన్ని ఆ ఇద్దరికీ ఇచ్చేందుకే ఈ స్కిట్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి గెటప్ శ్రీను, సుధీర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. లోలోపల ఏదో పెద్దగానే జరిగినట్టుంది. అందుకే ఆది, సుధీర్, గెటప్ శ్రీను వరుసగా బయటకు వచ్చేశారు. మళ్లీ ఇంకా ఎంత మంది వస్తారో చూడాలి. అంతకు ముందే అభి బయటకు వచ్చేశాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది