Home » Entertainment » Manchu Manoj Got Married On The Third Of March
Entertainment

Big Breaking : మార్చి మూడవ తారీకు మంచు మనోజ్ పెళ్లి..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: February 25, 2023 11:27 am
Advertisement

Big Breaking : హీరో మంచు మనోజ్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ ప్రాంతం రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన భూమా మౌనికతో గత కొంతకాలంగా మంచు మనోజ్ కలిసి ఉంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు చాలా సందర్భాలలో మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. అయితే వీరిద్దరూ మార్చి మూడవ తారీకు పెళ్లి చేసుకోవడానికి రెడీ కావడం జరిగిందంట.

Advertisement

Manchu Manoj got married on the third of March

కేవలం కొద్ది మంది సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. 2015 వ సంవత్సరంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని.. మంచు మనోజ్ మొదటి పెళ్లి చేసుకోవడం జరిగింది. కొన్నాళ్లు కలిసి ఉండగానే 2019 సంవత్సరంలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో భూమా మౌనిక రెడ్డితో గత కొంతకాలం నుండి సన్నిహితంగా ఉంటున్నా మనోజ్ మార్చి మూడవ తారీఖున పెళ్లి చేసుకోవడానికి రెడీ కావడం జరిగింది.

Advertisement

Manchu Manoj got married on the third of March

ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫంక్షన్ మనోజ్ సోదరి లక్ష్మీప్రసన్న ఇంట్లో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది వారాల క్రితం త్వరలో శుభవార్త అనే హింట్ కూడా మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా ఇప్పుడు.. పెళ్లికి రెడీ కావడంతో… ఆ శుభవార్త ఇదే అని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. మంచు మనోజ్ 2004వ సంవత్సరంలో “దొంగ దొంగది” సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. కానీ 2018 తర్వాత ఆయన నుండి ఎటువంటి సినిమా రాలేదు. “అహం బ్రహ్మాస్మి” అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన అది ఆగిపోయింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి