Manchu Manoj : మెగా ఫ్యాన్స్ ఇంతటితో వదిలేయండి.. క్షమాపణలు చెప్పిన మనోజ్..!
Manchu Manoj : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భైరవం’.ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.’నలుగురైదుగురు ఒక కులానికి చెందిన వ్యక్తులు కలిసి సినిమా చేస్తున్నారని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సినిమా అనేది ఏ ఒక్క కులానికి చెందినది కాదు.
Manchu Manoj : మెగా ఫ్యాన్స్ ఇంతటితో వదిలేయండి.. క్షమాపణలు చెప్పిన మనోజ్..!
సినిమా అనే కళామతల్లి తన మతం చూడదు.. కులం చూడదు.. గోత్రం చూడదు. మా కులం సినిమా.. నా గుడి సినిమా థియేటర్. టికెట్ తెగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా, కమ్మ సినిమానా, కాపు సినిమానా, హిందూ సినిమానా, క్రిస్టియన్ సినిమానా అనేది ఎవరూ చూడరు. హీరో సూర్య ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన క్యాస్ట్ ఏంటి?. తెలుగు మూవీ లవర్స్ టాలెంట్ ఉంటే ఎక్కడివారైనా తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. కులం, మతం, బ్యాగ్రౌండ్ చూడకుండా.. ఎవరనేది తెలియకపోయినా, డబ్బు వెనక్కి వస్తుందో లేదో తెలియకపోయినా.. కేవలం టాలెంట్ చూసి ఆర్టిస్టుల మీద ఖర్చు పెట్టేవారే మన నిర్మాతలు.
ఈ మధ్యకాలంలో సినిమాపై బాయ్ కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తోంది. డైరెక్టర్ విజయ్ చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తి. అబద్దాలు చెప్పకుండా, పదిమందికి సేవ చేస్తూ బ్రతకడమే ఆయనకు తెలుసు. ఏదో తీసుకొచ్చి ట్యాగ్ చేసి, ఇంతమంది కష్టపడి పని చేసిన సినిమాపై పోస్టులు పెడుతున్నారు. వేరే ఎవరైనా అంటే ఆయన పట్టించుకునేవారు కాదు. కానీ, సొంత కుటుంబంలాంటి మెగా అభిమానులే విమర్శిస్తుంటే.. ఆయన్ను డల్ గా చూడలేకపోతున్నా. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుతున్నా. పోస్టు విషయంలో మీరు ఇబ్బంది ఫీల్ అయినందుకు మా టీమ్ తరఫున మీ అందరికీ క్షమాపణలు కోరుతున్నాఅని మనోజ్ అన్నారు.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
This website uses cookies.