Manchu Manoj : మెగా ఫ్యాన్స్ ఇంత‌టితో వ‌దిలేయండి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మ‌నోజ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Manchu Manoj : మెగా ఫ్యాన్స్ ఇంత‌టితో వ‌దిలేయండి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మ‌నోజ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 May 2025,12:20 pm

ప్రధానాంశాలు:

  •  Manchu Manoj : మెగా ఫ్యాన్స్ ఇంత‌టితో వ‌దిలేయండి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మ‌నోజ్..!

Manchu Manoj  : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నారా రోహిత్‌, మంచు మనోజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భైరవం’.ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.’నలుగురైదుగురు ఒక కులానికి చెందిన వ్యక్తులు కలిసి సినిమా చేస్తున్నారని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సినిమా అనేది ఏ ఒక్క కులానికి చెందినది కాదు.

Manchu Manoj మెగా ఫ్యాన్స్ ఇంత‌టితో వ‌దిలేయండి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మ‌నోజ్

Manchu Manoj : మెగా ఫ్యాన్స్ ఇంత‌టితో వ‌దిలేయండి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మ‌నోజ్..!

Manchu Manoj  వారికి సారి..

సినిమా అనే కళామతల్లి తన మతం చూడదు.. కులం చూడదు.. గోత్రం చూడదు. మా కులం సినిమా.. నా గుడి సినిమా థియేటర్. టికెట్ తెగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా, కమ్మ సినిమానా, కాపు సినిమానా, హిందూ సినిమానా, క్రిస్టియన్ సినిమానా అనేది ఎవరూ చూడరు. హీరో సూర్య ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన క్యాస్ట్ ఏంటి?. తెలుగు మూవీ లవర్స్ టాలెంట్ ఉంటే ఎక్కడివారైనా తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. కులం, మతం, బ్యాగ్రౌండ్ చూడకుండా.. ఎవరనేది తెలియకపోయినా, డబ్బు వెనక్కి వస్తుందో లేదో తెలియకపోయినా.. కేవలం టాలెంట్ చూసి ఆర్టిస్టుల మీద ఖర్చు పెట్టేవారే మన నిర్మాతలు.

ఈ మధ్యకాలంలో సినిమాపై బాయ్ కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తోంది. డైరెక్టర్ విజయ్‌ చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తి. అబద్దాలు చెప్పకుండా, పదిమందికి సేవ చేస్తూ బ్రతకడమే ఆయనకు తెలుసు. ఏదో తీసుకొచ్చి ట్యాగ్ చేసి, ఇంతమంది కష్టపడి పని చేసిన సినిమాపై పోస్టులు పెడుతున్నారు. వేరే ఎవరైనా అంటే ఆయన పట్టించుకునేవారు కాదు. కానీ, సొంత కుటుంబంలాంటి మెగా అభిమానులే విమర్శిస్తుంటే.. ఆయన్ను డల్ గా చూడలేకపోతున్నా. మెగా ఫ్యాన్స్‌ ఈ సినిమాకి సపోర్ట్‌ చేయాలని కోరుతున్నా. పోస్టు విషయంలో మీరు ఇబ్బంది ఫీల్‌ అయినందుకు మా టీమ్‌ తరఫున మీ అందరికీ క్షమాపణలు కోరుతున్నాఅని మ‌నోజ్ అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది