Home » Entertainment » Manchu Manoj Vs Manchu Vishnu Latest Updates
Entertainment

Manchu Manoj – Vishnu : మంచు మనోజ్ వర్సెస్ విష్ణు.. అసలు ఏం అయింది అంటే?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: March 24, 2023, 7:11 pm
Advertisement

Manchu Manoj – Vishnu : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, సినీ ఇండస్ట్రీలో మంచు మనోజ్, మంచు విష్ణు గొడవ చర్చనీయాంశం అయింది. మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమే. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నది ఇప్పుడు కాదు.. చాలా ఏళ్ల నుంచి ఉంది కానీ.. అవి వాళ్ల మధ్యే జరిగేవి కానీ.. ఇలా ఇద్దరూ బయటికి మాత్రం రాలేదు. తాజాగా తన అన్న మంచు మనోజ్.. బంధువుల ఇంటికి వెళ్లి, తనకు తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లపై విరుచుకుపడతాడని, ఇలా నన్ను కూడా కొట్టడానికి వస్తాడంటూ ఓ వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Advertisement

Manchu Manoj VS Manchu Vishnu Latest Updates

దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఎవరైనా ఫ్యామిలీ గొడవలను ఫ్యామిలీ మధ్యలోనే సరిదిద్దుకోవాలి కానీ.. ఇలా సోషల్ మీడియాలోకి ఫ్యామిలీ గొడవలను లాగడం ఏంటి అంటూ జనాలు అంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఇలా చేయడం ఏంటి.. ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు. దీనిపై ఒక సైకాలజిస్ట్ విజయ పెద్దిన స్పందించారు. ప్రతి మనిషి కూడా గొడవ జరిగే సమయం ఉన్నప్పుడు ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవాలి. మనం ఒక సొసైటీలో ఏ స్థాయిలో ఉన్నాం అనేది కూడా అనుకోవాలి.

Advertisement

Manchu Vishnu Attacked On His Own Brother Manchu Manoj on video

Manchu Manoj – Vishnu : సోషల్ మీడియాలోకి లాగడమే తప్పు

ఒక సెలబ్రిటీ అయి ఉన్నవాళ్లు ఇలా చేస్తే అందరి చూపు వాళ్లవైపే ఉంటుంది. వీళ్ల ఫ్యామిలీని సొసైటీ ఎలా చూస్తుంది. సమాజం ఎలా చూస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. మనం బయటికి వెళ్లినప్పుడు ఇంట్లో ఉన్నట్టే బయటికి వెళ్లం కదా. నలుగురు మనల్ని చూస్తుంటారు కాబట్టి బయట మంచిగా ఉంటాం. నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు కానీ.. నలుగురిలోకి వెళ్లిందంటే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. అలాంటి వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది చాలా తప్పు. అది ఇంపల్సివ్ నెస్. ఇందులో మంచు మనోజ్ ది పెద్ద తప్పు. వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా.. అవి ఫ్యామిలీ మధ్యనే సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ.. ఇలా నలుగురి ముందుకు పోవడం అనేది ఆ ఫ్యామిలీ పరువును తీసుకోవడమే అని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి