Home » Entertainment » Manchu Vishnu Praise On Prabhas
Entertainment

Manchu Vishnu : ప్ర‌భాస్ మాన‌వ‌త్వం వ‌ల‌న ఆయ‌న‌ని ఎక్కువ‌గా ప్రేమిస్తాను.. మంచు విష్ణు కామెంట్స్.. వీడియో !

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 22, 2025 11:41 am
Advertisement

Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప చిత్రం జూన్ 27న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ ఎపిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట‌గా నిర్వహించింది చిత్రయూనిట్.

Advertisement

Manchu Vishnu : ప్ర‌భాస్ మాన‌వ‌త్వం వ‌ల‌న ఆయ‌న‌ని ఎక్కువ‌గా ప్రేమిస్తాను.. మంచు విష్ణు కామెంట్స్..!

Manchu Vishnu : ప్ర‌భాస్‌పై ప్ర‌శంస‌లు..

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఆ సినిమాను ఎంతో బాధ్యతతో, క్రమశిక్షణతో ఒక మంచి చిత్రాన్ని తీశామని అన్నారు. చెప్పుకోలేని ఎన్నో బాధలు ఈ సినిమా వెనక ఉన్నాయి. అంత సులభంగా ఈ మూవీ జరగలేదు. శివరాజ్ కుమార్ మాట్లాడుతూ… ఈ సినిమా చేయాలని ఎందుకనిపించింది అని అడిగారు. ఈ తరానికి కన్నప్ప గురించి, వాయులింగం గురించి, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడి ఆదేశించాడని చెప్పాను.

Advertisement

స్నేహితుల్లో కృష్ణుడు, కర్ణుడిలా రెండు రకాలు ఉంటారు. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు. తన జీవితంలో కర్ణుడిలా ఎప్పుడు ఏం చేసినా వెనకే ఉంటాను. ఆయన ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. నాన్నపై ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో ఒప్పుకున్నాడు. ప్రభాస్ ప్రపంచంలోనే ఓ పెద్ద స్టార్ హీరో. కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిశామో.. ఇప్పటికీ అలాగే ఉన్నాము” అంటూ చెప్పుకొచ్చారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇలాంటి సినిమాలో నటించాడంటే ఆయన నుంచి అందరూ మంచితనాన్ని నేర్చుకోవాలని మంచు విష్ణు అన్నాడు .

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి