Home » Entertainment » Manchu Vishnu Sensational Comments On Chiranjeevi
Entertainment

Chiranjeevi : కుటుంబ పెద్దల్లో ఒకరంటూనే.. చిరంజీవిపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..

Authored By
praveen T
The Telugu News | Published on: October 11, 2021, 10:04 pm
Advertisement

Chiranjeevi : గతంలో ఎన్నడు లేనంత పోటాపోటీగా, రసవత్తరంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ (మా) జరగగా అందులో విలక్షణ నటుడు ప్రకాశ్‌‌రాజ్‌పై మంచు విష్ణు గెలిచాడు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నిక కాగా ఆయన ప్యానెల్ నుంచి పలువురు గెలుపొందారు. ఈ క్రమంలో తాజాగా మా ఫౌండింగ్ మెంబర్, మెగాస్టార్ చిరంజీవిపై హీరో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

manchu vishnu comments on chiranjeevi

‘మా’ ఎలక్షన్స్‌కు ముందర మెగాస్టార్ చిరు తనను పోటీ నుంచి తప్పుకోవాలని అన్నారని, ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దనుకున్నానని, కానీ, ఎన్నికలు ముగిశాయి కాబట్టి చెప్తున్నానని విష్ణు తెలిపాడు. గెలుపోటములు సహజమని చెప్పాడు. మెగా బ్రదర్ నాగబాబు రాజీనామాను ఆమోదించబోనని విష్ణు పేర్కొన్నాడు. ‘మా’ కుటుంబ పెద్దల్లో ఒకరు నాగబాబు అని అన్నారు. ఇకపోతే తనకు విలక్షణ నటడు ప్రకాశ్ రాజ్ సపోర్ట్ కూడా కావాలని విష్ణు చెప్పాడు.

Advertisement

ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల మ్యాండేట్‌ను గౌరవిస్తూ ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను అతిథిగానే వచ్చానని, అలానే ఉంటానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాల్లోనూ నటిస్తానని ప్రకాశ్‌రాజ్ తెలిపారు.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి