Karthika Deepam : పట్టపగలే చుక్కలు చూపించిన భార్య.. దెబ్బకు దడుసుకున్న డాక్టర్ బాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam : పట్టపగలే చుక్కలు చూపించిన భార్య.. దెబ్బకు దడుసుకున్న డాక్టర్ బాబు

Karthika Deepam : బుల్లితెరపై డాక్టర్ బాబుగా నిరుపమ్ తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కార్తీకదీపం సీరియల్‌తో పాటు సోషల్ మీడియాలోనూ నిరుపమ్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిరుపమ్ భార్య మంజుల కూడా సీరియల్ నటి. చంద్రముఖి సీరియల్‌తో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ సీరియల్ షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వివాహా బంధంతో ఒక్కటయ్యారు. అయితే మంజుల మాత్రం అంతగా ఫేమస్ కాలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :10 October 2021,6:40 pm

Karthika Deepam : బుల్లితెరపై డాక్టర్ బాబుగా నిరుపమ్ తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కార్తీకదీపం సీరియల్‌తో పాటు సోషల్ మీడియాలోనూ నిరుపమ్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిరుపమ్ భార్య మంజుల కూడా సీరియల్ నటి. చంద్రముఖి సీరియల్‌తో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ సీరియల్ షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వివాహా బంధంతో ఒక్కటయ్యారు. అయితే మంజుల మాత్రం అంతగా ఫేమస్ కాలేకపోయింది.

Manjula Special Shopping WIth Nirupam On Dasara

Manjula Special Shopping WIth Nirupam On Dasara

కానీ సోషల్ మీడియాలో మాత్రం డాక్టర్ బాబు భార్యగా మంజులకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనే మంజుల నిరుపమ్ యూట్యూబ్ చానెల్ పెట్టేశారు. పెట్టిన కొన్ని రోజుల్లో చానెల్ మంచి పాపులర్ అయింది. లక్షల మంది సబ్ స్క్రైబర్లుగా మారారు. వీడియోలన్నీ కూడా ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. దసరా సందర్భంగా ఆడవాళ్లు చేసే షాపింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దేవీ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రకాల చీరలు కొనేందుకు మంజుల సిద్దపడింది.

భార్య షాపింగ్‌కు నిరుపమ్ షాక్..

Manjula Special Shopping WIth Nirupam On Dasara

Manjula Special Shopping WIth Nirupam On Dasara

ఈ మేరకు భర్త నిరుపమ్‌ను షాపింగ్‌కు తీసుకెళ్లింది. దాన్ని కూడా ఓ వీడియోగా చేసి యూట్యూబ్‌లో వదిలింది. అలా షాపింగ్ చేయడమే కాకుండా.. ఆ షాపుకు కూడా పాపులారిటీ కలిపించారు. తద్వారా యాడ్ ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ షాపింగ్ అంతా కూడా ఫ్రీగానే జరుగిందని తెలుస్తోంది. మొత్తానికి షాపింగ్ చేస్తూ తొమ్మిది రకాల చీరలు కొనేప్పటికీ నిరుపమ్‌కు చుక్కలు కనిపించినట్టున్నాయి. దాదాపు 20 చీరలు సెలెక్ట్ చేసిన మంజుల.. అందులోంచి తొమ్మిదింటిని ఫైనల్ చేసింది. ఇక చివర్లో ఒకదాని సెలెక్ట్ చేసుకోలేక నిరుపమ్‌కు వదిలేసింది. ఏదో ఒకటి సెలెక్ట్ చేయమని చెప్పింది. అలా మొత్తానికి భార్య షాపింగ్ చూసి నిరుపమ్ షాక్ అయ్యాడు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది