Home » Entertainment » Marathi Actress Tejaswini Pandit About Her Bad Experience In Pune
Entertainment

Star Heroine : ఇంటి రెంట్ ఇవ్వడానికి వెళ్తే దాని బదులు రాత్రి పడుకో అని స్టార్ హీరోయిన్ కు ఆఫర్ ఇచ్చాడట.. దీంతో ఆ నటి ఏం చేసిందంటే..?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 20, 2022, 9:40 pm
Advertisement

Star heroine : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి విన్నాం కదా. కానీ.. అది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే ఉండదు. సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులపై బయట కూడా జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లపై ఇది ఎక్కువగా ఉంటుంది. చాలామంది అవకాశాల కోసం, డబ్బు కోసం కమిట్ మెంట్స్ అడుగుతుంటారు. నిజానికి ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే లేదు. ఇది హాలీవుడ్ లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ కు వ్యాప్తి చెందింది.ఆ మధ్య ఈ కాస్టింగ్ కౌచ్ అన్ని ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపింది.

Advertisement

మీటూ అంటూ చాలామది నటీమణులు తమకు జరిగిన అన్యాయాన్ని షేర్ చేశారు. అయితే.. ఇది ఇండస్ట్రీలోనే కాదు.. బయట కూడా జరుగుతుంది అంటూ ఓ స్టార్ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా షేర్ చేసుకుంది. ఆమె ఎవరో కాదు.. మరాఠీ హీరోయిన్ తేజస్విని పండిట్. 2009 లో తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఘటన గురించి తేజస్విని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. హీరోయిన్స్ కు ఇండస్ట్రీలో కంటే.. బయట కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని..

marathi actress tejaswini pandit about her bad experience in pune

Advertisement

Star heroine : కెరీర్ ప్రారంభంలో పూణెలో జరిగిన చేదు ఘటనను షేర్ చేసుకున్న తేజస్విని

2009 లో పూణెలో ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉన్న సమయంలో.. రెంట్ కట్టడం కోసం అపార్ట్ మెంట్ ఓనర్ దగ్గరికి వెళ్తే.. రెంట్ వద్దు కానీ.. ఫేవర్ కావాలంటూ డైరెక్ట్ గా అడిగేశాడట. అంటే.. రెంట్ డబ్బులు ఏం ఇవ్వకు కానీ.. నాతో గడుపు అన్నాడట. దీంతో అక్కడే టేబుల్ మీద ఉన్న గ్లాస్ లోని వాటర్ తో తన ముఖంపై కొట్టిందట. నేను అటువంటి పనులు చేసేదాన్నే అయితే ఈ కెరీర్ ఎంచుకునేదాన్ని కాదని.. అసలు అలా తప్పుగా అనుకుంటే.. నీ అపార్ట్ మెంట్ లో ఉండే అవసరం నాకు లేదని చెప్పి గట్టిగా అరిచిందట తేజస్విని. ఆమె ఇంటర్వ్యూలో చెప్పిన ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి