Mass Jathara : మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' మూవీ నుంచి రెండవ గీతం 'ఓలే ఓలే' విడుదల
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘మాస్ జాతర’ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి గీతంగా విడుదలైన ‘తు మేరా లవర్’ అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండవ గీతంగా ‘ఓలే ఓలే’ను విడుదల చేసింది చిత్ర బృందం. అందరూ కాలు కదిపేలా ఎంతో ఉత్సాహభరితంగా ఈ గీతముంది.
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ మూవీ నుంచి రెండవ గీతం ‘ఓలే ఓలే’ విడుదల
ధమాకా జోడి రవితేజ-శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. ‘ఓలే ఓలే’ పాటతో ఈ జోడి మరోసారి ఆకట్టుకుంది. ఇద్దరూ పోటాపోటీగా నర్తించి పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. రవితేజ తన వింటేజ్ స్టెప్పులతో అలరించారు. శ్రీలీల తన అసాధారణ నృత్య ప్రతిభతో మరోసారి కట్టిపడేశారు. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తెరపై మెరుపులు మెరిపిస్తున్నారు.సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో స్వరపరిచిన ‘ఓలే ఓలే’ మాస్ రాజా అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంది. థియేటర్లలో ప్రేక్షకుల చేత.. ఈలలు, చప్పట్లతో స్టెప్పులు వేయించేలా ఎంతో ఉత్సాహభరితంగా ఈ గీతం సాగింది. ఇక ప్రతిభావంతులైన రోహిణి సోరట్ తన గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.
భాస్కర్ యాదవ్ దాసరి అందించిన సాహిత్యం ఉల్లాసంగా, ఆకర్షణీయంగా ఉంది. పాట యొక్క మూడ్‌కి సరిగ్గా సరిపోయే మాస్ ఫ్లేవర్‌తో ఆయన సాహిత్యం నిండి ఉంది. సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ చక్కగా కుదిరి.. ‘ఓలే ఓలే’ను అదిరిపోయే మాస్ గీతంగా మలిచాయి.దర్శకుడు భాను బోగవరపు.. రవితేజ అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ‘మాస్ జాతర’ను మలుస్తున్నారు. పాటల విషయంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మాస్ రాజా వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో ఈ చిత్రంతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురాబోతున్నారు.
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యతో కలిసి ‘మాస్ జాతర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.’మాస్ జాతర’ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఫుల్ మీల్స్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
This website uses cookies.