Home » Entertainment » Meena Family Gets Corona
Entertainment

Meena : మీనా ఫ్యామిలీ మొత్తానికి క‌రోనా.. ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది?

Authored By
Sam C
The Telugu News | Published on: January 5, 2022, 9:00 pm
Advertisement

Meena : క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆట‌లాడుతుంది. ఈ మ‌హ‌మ్మారి ఎంతో మంది ప్ర‌జ‌ల జీవితాల‌ని ఛిన్నాభిన్నం చేసింది. క‌రోనా కాస్త శాంతించింది అని అంద‌రు ఎవ‌రి ప‌నుల‌తో వారు బిజీగా ఉంటున్న స‌మ‌యంలో ఒమిక్రాన్ అనే కొత్త వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తుంది. ద‌క్షిణాఫ్రికాలో బుస‌లు కొట్టిన ఈ మ‌హ‌మ్మారి అన్ని దేశాల‌కు పాకింది. భార‌త్‌లోను చాప‌కింద నీరులా విస్త‌రిస్తుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు.

Advertisement

తాజాగా అల‌నాటి స్టార్ హీరోయిన్ మీనా కుటుంబం మొత్తం క‌రోనా బారిన ప‌డింది. త‌న‌తో పాటు త‌న కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్టు మీనా సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ‘‘2022లో మా ఇంటికి విచ్చేసిన తొలి అతిథి కరోనా. దానికి మా కుటుంబమంతా నచ్చింది. అయినా సరే దాన్ని మా ఇంట్లో ఉండనివ్వను. మీరంతా జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా వ్యవహరించండి. కరోనాను వ్యాప్తి చేయకండి’’ అని విజ్ఞప్తి చేశారు.

meena family gets corona

Advertisement

Meena : ఇంటికి వ‌చ్చిన అతిథిని ఇంట్లో ఉండ‌నివ్వ‌ను…మీనా

క‌రోనాపై సెటైరిక‌ల్‌గా మీనా చేసిన పోస్ట్ అందరిని ఆక‌ట్టుకుంటుంది. అంతేకాక అభిమానులు మీనాతో పాటు ఆమె ఫ్యామిలీ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప్రార్ధిస్తున్నారు. కాగా, గతేడాది ‘దృశ్యం 2’, ‘పెద్దన్న’ చిత్రాలతో అలరించిన మీనా ప్రస్తుతం ‘బ్రో డాడీ’ అనే మలయాళం సినిమాలో నటిస్తున్నారు. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తూ అగ్ర హీరోల సరసన ఆడిపాడిన మీనా.. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. తల్లి, అక్క పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి