Meena : సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్(48) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో బాధ పడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. కాగా, ఇంత చిన్న వయస్సులో ఆయన మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది మీనా ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడింది. కోవిడ్ నుంచి మీనా, నైనిక కోలుకున్నారు. కానీ విద్యా సాగర్ కి పోస్ట్ కోవిడ్ సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఆయన శ్వాస వ్యవస్థ దెబ్బ తినింది. ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడం ఓ కారణంగా చెబుతున్నారు.
దీనికి తోడు ఆయన పావురాల విసర్జన నుంచి వచ్చే కలుషితమైన గాలి వల్ల కూడా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తులు ఎక్కువ భాగం చెడిపోవడంతో వైద్యులు ట్రాన్స్ ప్లాంటేషన్ సూచించారట. కానీ అది అంత సులువు కాదు. వేరొకరి ఊపిరి తిత్తులు లభించాలి. అలాగే అవి సెట్ అవుతాయని వైద్యులు కూడా 100 శాతం చెప్పడం కష్టం. దీనితో విద్యాసాగర్ గత కొన్ని నెలలుగా చికిత్సనే కొనసాగిస్తున్నారు. మంగళవారం ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు కాపాడలేకపోయారు. మీనా భర్త మృతి చెందారని తెలియడంతో షాక్ లో ఉన్నా. జీవితం చాలా దారుణమైనది. ఇప్పుడు నా మనసు మీనా, ఆమె ఫ్యామిలీ గురించి ఆలోచిస్తోంది.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని సోషల్ మీడియాలో అన్నారు. మీనా, విద్యాసాగర్‌ల వివాహం 2009లో జరిగింది. వీరికి ఒక పాప. పేరు నైనిక. తలపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. విద్యాసాగర్ అకాల మరణం తీవ్రంగా కలచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి. మీనా, విద్యాసాగర్ ఇద్దరూ నా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అంటూ నటుడు శరత్ కుమార్ ట్వీట్ చేశారు. విద్యాసాగర్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైలోనే జరిగాయి. మీనా తెలుగు, తమిళం, కన్నడ, పలు భాషలలో నటించడంతో పాటు అశేష ప్రేక్షకాదారణ పొందింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.