Drushyam : దృశ్యం సినిమాకి మీనా ఆ రకంగా పెద్ద మైనస్.. ఇన్నాళ్ళకి టాప్ సీక్రెట్ బయట పెట్టిన దర్శకుడు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Drushyam : దృశ్యం సినిమాకి మీనా ఆ రకంగా పెద్ద మైనస్.. ఇన్నాళ్ళకి టాప్ సీక్రెట్ బయట పెట్టిన దర్శకుడు..?

Drushyam : దృశ్యం సినిమా అటు మలయాళంలో ఇటు తెలుగులో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ – మీనా జంటగా నటించగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. సింపుల్ కథ ని మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించి ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే సినిమాని దృశ్యం పేరుతోనే తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేష్ – మీనా జంటగా నటించారు. తెలుగు వెర్షన్ కి […]

 Authored By govind | The Telugu News | Updated on :2 March 2021,3:15 pm

Drushyam : దృశ్యం సినిమా అటు మలయాళంలో ఇటు తెలుగులో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ – మీనా జంటగా నటించగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. సింపుల్ కథ ని మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించి ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే సినిమాని దృశ్యం పేరుతోనే తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేష్ – మీనా జంటగా నటించారు. తెలుగు వెర్షన్ కి శ్రీప్రియ దర్శకత్వం వహించారు.

meena is minus for drushyam movie top secret revealed by the director

meena-is-minus-for-drushyam-movie-top-secret-revealed-by-the-director

ఇటు తెలుగులో అటు మలయాళంలో భారీ సక్సస్ అందుకుంది దృశ్యం. కానీ నెటిజన్స్ మాత్రం ఒక్క విషయంలో దర్శకుడిని .. హీరోయిన్ గా నటించిన మీనా ని విపరీతంగా ట్రోల్స్ అండ్ కామెంట్ చేశారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2013 లో మలయాళంలో 2014 లో తెలుగులోనూ వచ్చిన ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో తెరకెక్కించారు. కథ.. కథనం ప్రకారం పాత్రలన్నీ ఎంతో సహజంగా కనిపించాలి. వీలైనంతవరకు నేచురల్ గా కనిపించాలి.

Drushyam : దృశ్యం 2 లో మీనా ఎలా కనిపించబోతుందో చూడాలి.

మధ్య తరగతి యువతిగా నటించిన మీనా మేకప్ లేకుండా కనిపించాల్సింది. కాని మీనా అలా చేయలేదు. సినిమా మొదటి నుంచి చివరి వరకు క్లాస్ గా ఫుల్ మేకప్ లోనే కనిపించింది. కథ కి తగ్గట్టు మేకప్ లేకుండా కనిపించాలని దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పినా కూడా మీనా ససేమిరా అన్నదట. మేకప్ లేకుండా నటించమంటే కుదరదని తేల్చి చెప్పిందట. దాంతో అందరూ దర్శకుడిని తప్పు పడుతూ కామెంట్ చేశారు. దాంతో దర్శకుడు క్లారిటీ ఇస్తూ నేను చెప్పినప్పటికి మీనా వినలేదని … తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే అలానే చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు రాబోతున్న దృశ్యం 2 లో మీనా ఎలా కనిపించబోతుందో చూడాలి.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది