Anil Ravipudi Next Film : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో బాబాయ్ , అబ్బాయి నిజమేనా ?
ప్రధానాంశాలు:
Anil Ravipudi Next Film : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో బాబాయ్ , అబ్బాయి నిజమేనా ?
Anil Ravipudi Next Film : టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విక్టరీ వెంకటేష్‌తో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన అనిల్, ఈసారి మరో మెట్టు పైకి ఎక్కి వెంకటేష్ మరియు రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వీరిద్దరూ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో తండ్రీకొడుకులుగా నటించి మెప్పించగా, ఇప్పుడు వెండితెరపై అనిల్ రావిపూడి మార్కు వినోదంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
Anil Ravipudi Next Film : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో బాబాయ్ , అబ్బాయి నిజమేనా ?
ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది. నిన్నటి వరకు నాగార్జున తో అనిల్ రావిపూడి సినిమా చేయబోతారని ప్రచారం జరిగింది..ఈరోజు మాత్రం వెంకీ తో అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అనిల్ ఎవరితో నెక్స్ట్ అనేది చెపితే కానీ ఈ ప్రచారాలకు తెరపడదు.
ఇక మెగాస్టార్ చిరంజీవి తో అనిల్ చేసిన మన శంకర వరప్రసాద్ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చి అఖండ విజయం సాధించింది. అనిల్ మార్క్ టేకింగ్ , చిరు యాక్టింగ్ , వెంకీ ప్రత్యేక రోల్ ఇలా అన్ని సినిమా విజయం లో తోడ్పడ్డాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవ్వడమే కాదు చిరు కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టింది. రెండు వారాల్లోనే ఈ మూవీ రూ.300 కోట్లు సాధించింది. ఇంకా ఈ మూవీ హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది. అలాగే చిరు నెక్స్ట్ మూవీ ‘విశ్వంభర’ సినిమా విషయానికి వస్తే, ఇది సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన ఒక అద్భుత దృశ్యకావ్యం. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతుంది. చిరంజీవి కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.