
mega allu family at allu studios opening
Allu Studios : అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ ప్రారంభించారు అల్లు ఫ్యామిలీ మెంబర్స్. అల్లు అరవింద్ (Allu Aravind ) నిర్మించిన ఈ అల్లు స్టూడియోస్ ఆరంభానికి అల్లు రామలింగయ్య అల్లుడు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయ్యారు. అల్లు స్టూడియోస్ ఇది లాభాపేక్షతో పెట్టిన స్టూడియో కాదు అల్లు స్టేటస్ కోసం పెట్టిన స్టూడియో అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి.ఇక ఈ ఓపెనింగ్ సెరిమనీలో మెగాస్టార్ చిరంజీవితో అల్లు అర్జున్ పక్కనే ఉంటూ సహకరించారు.తండ్రి వారసత్వాన్ని అల్లు అరవింద్ సక్సెస్ ఫుల్ గా కొనసాగించారు..
తాత వారసత్వాన్ని మనవళ్లు కూడా కొనసాగిస్తున్నారని చిరు అన్నారు. ఈ కార్యక్రమం మొత్తం లో మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.అయితే ఈమధ్య సినిమా ఈవెంట్ లో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల మెగా, అల్లు ఫ్యాన్స్ ఒకటి కాదు.. వారిలో వేరు వర్గాలు ఉన్నాయి అన్నట్టుగ వార్తలు వచ్చాయి.అందుకే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తను మాట్లాడే ప్రతి స్పీచ్ లో అందరికి ఫ్యాన్స్ ఉంటారు కానీ తనకు మాత్రం ఆర్మీ ఉంటుందని మరీ మరీ చెబుతాడు. ఇదే మెగా ఫ్యాన్స్ కి ఎక్కడో కాలేలా చేస్తుంది.అవన్ని పక్కన పెడితే అల్లు స్టూడియో ఓపెనింగ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఆయన ఫ్యామిలీ మీద అల్లు ఫ్యామిలీ చూపించిన అభిమానం చూస్తుంటే..
mega allu family at allu studios opening
మీరు మీరు కొట్టుకు చావండి మేమంతా ఒకటే అని మరోసారి ప్రూవ్ చేసినట్టు అయ్యింది. అల్లు రామలింగయయ శత జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ అల్లు స్టూడియోస్ ప్రారంభం జరిగింది.నార్సింగ్ కోకాపేట ఏరియాలో 10 ఎకరాల్లో ఈ అల్లు స్టూడియోస్ ప్రారంభించారు. ప్రస్తుతం ఒక స్టూడియో ఫ్లోర్ పూర్తయిందని తెలుస్తుంది. మరో ఫ్లోర్ ని సిద్ధం చేస్తున్నారట. గీతా ఆర్ట్స్ సినిమాలతో పాటుగా ఓటీటీ మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ మాత్రమే కాదు బయట బ్యానర్ సినిమాలకు అల్లు స్టూడియోస్ అందుబాటులో ఉంటుంది. అల్లు స్టూడియోస్ ని అభివృద్ధి చేసేందుకు అల్లు అరవింద తీవ్రంగా కృషి చేస్తున్నారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.