Mega Daughters : ఆ హీరో కోసం ఇద్దరు మెగా డాటర్స్ కొట్లాట.. ఫైనల్ గా విన్నర్ ఎవరంటే..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 23, 2022, 10:00 pm

Mega Daughters : మెగా ఫ్యామిలీ నుంచి హీరోలే కాదు హీరోయిన్స్ కూడా వచారు. ఆ వరుసలో మెగా బ్రదర్ నాగ బాబు తనయురాలు నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా మరో రెండు మూడు ప్రయత్నాలు చేసి హీరోయిన్ గా వర్క్ అవుట్ కాదని నిర్మాతగ సెటిల్ అయ్యింది. అప్పటికే ఓ ప్రొడక్షన్ హౌజ్ స్థాపించి వెబ్ సీరీస్ లను చేస్తున్న నిహారిక ఇప్పుడు ఫీచర్ సినిమాలనే చేయాలని చూస్తుంది. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది.

మొన్నటిదాకా కాస్టూం డిజైనర్ గా ఉన్న సుస్మిత ఇప్పుడు ఫుల్ టైం నిర్మాతగా మారింది. అయితే ఈ ఇద్దరు మెగా డాటర్స్ ఒకే హీరోతో సినిమాలు చేశారు. ఇంతకీ ఆ లక్కీ హీరో ఎవరంటే సంతోశ్ శోభన్ అని తెలుస్తుంది. సుస్మిత నిర్మాణంలో శ్రీదేవి శోభన్ బాబు సినిమా చేశాడు సంతోశ్ శోభన్. ఆ సినిమా రిలీజ్ కి ఇంకా ముహుర్తం బయటపడలేదు. ఇక నిహారిక నిర్మాణంలో కూడా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అనే సినిమా చేశాడు సంతోష్ శోభన్. రెండు సినిమాల్లో హీరో ఒకడే. అయితే వారి సినిమాల రిలీజ్ విషయంలో నిహారిక మూవీ క్లారిటీకి వచ్చింది. నవంబర్ 4న లైక్ సేర్ స స్క్రైబ్ మూవీ రిలీజ్ ఫిక్స్ చేశారు.

mega daughter fight for one hero movie

mega daughter fight for one hero movie

అయితే ఈ సినిమా కన్నా ముందే శ్రీదేవి శోభన్ బాబు సినిమా పూర్తయినా కొన్ని నెలలుగా సరైన రిలీజ్ డేట్ దొరక్క వెయిట్ చేస్తుంది. అయితే అక్కచెల్లల్లు ఒకరి సినిమా కి ఒకరు పోటీ పడేలా ఉన్నారు. సుస్మిత తన సినిమా రిలీజ్ డేట్ ఇంకా నిర్ణయించుకోలేదు. నిహారిక మాత్రం లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాని రిలీజ్ చేస్తుంది. ఆల్రీఎ ప్రొడక్షన్ లో అనుభవం ఉంది కాబట్టి సినిమా రిలీజ్ పై నిహారికకు ఉన్న క్లారిటీ సుస్మితకు లేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా నిహారిక నిర్ణయానికి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. యువ హీరోల్లో తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్న సంతోశ్ శోభన్ ఈ రెండు సినిమాలతో హిట్ కొడతాడో లేదో చూడాలి.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp