Niharika : మెగా ఫ్యాన్స్ కు నచ్చని పని చేస్తునంటున్న నిహారిక ..?
ప్రధానాంశాలు:
Niharika : మెగా ఫ్యాన్స్ కు నచ్చని పని చేస్తునంటున్న నిహారిక ..?
Niharika : మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా అరంగేట్రం చేసి నిహారిక ప్రత్యేకత చాటుకుంది. సినీరంగంలో అడుగుపెట్టే ముందు ఆమెను మెగా అభిమానులు వ్యతిరేకించినప్పటికీ, తన కలను సాకారం చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు సాగింది. 2016లో “ఒక మనసు” అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన నిహారిక, ఆ తర్వాత “హ్యాపీ వెడ్డింగ్”, “సూర్యకాంతం” వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. కాకపోతే ఆశించిన విధంగా ఆమెకు నటిగా బ్రేక్ రాలేదు. కొన్ని తమిళ చిత్రాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారిక, చిరంజీవి నటించిన “సైరా నరసింహారెడ్డి” చిత్రంలో ఓ చిన్న గెస్ట్ రోల్ చేసింది. అయినప్పటికీ బిజీ కాలేకపోవడం తో కుటుంబ పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్‌లో వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది…

Niharika : మెగా ఫ్యాన్స్ కు నచ్చని పని చేస్తునంటున్న నిహారిక ..?
Niharika నిహారిక కోరిక తీర్చుకోవడంలో సక్సెస్ అవుతుందా..?
వెంకట చైతన్య తండ్రి ప్రభాకర్ ప్రముఖ పోలీస్ అధికారి కావడంతో, అతని కుటుంబానికి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఐదు రోజుల పాటు జరిగిన ఈ గ్రాండ్ వేడుకకు మెగా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అయితే పెళ్లి అనంతరం కొన్ని విభేదాల కారణంగా నిహారిక-చైతన్య విడిపోయారు.
ప్రస్తుతం నిహారిక నటిగా కాకుండా, నిర్మాతగా ఎదగాలని ట్రై చేస్తుంది. కొత్త చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉంటూ, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టింది. అంతే కాదు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలు, ప్రొఫెషనల్ అప్‌డేట్స్ అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం ఫోకస్ అంత సినిమాలపైనే పెట్టింది. మరి సినిమాలతో తన అనుకున్న కోరిక నెరవేర్చుకుంటుందా..? లేదా అనేది చూడాలి.