
Manchu Vishnu Satirical Comments On Telugu Film Industry Person Over Pension
Manchu Vishnu : మంచు విష్ణు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ మధ్య కాలంలో ఈయన సినిమాల కంటే ఎక్కువ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసాడా అనిపించేటట్లుగా ఆయన రెగ్యులర్ గా వివాదాలను చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పటి నుండి మంచు విష్ణు హడావుడి మామూలుగా లేదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా హంగామా చేస్తున్నాడు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టికెట్ల రేట్ల విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలు కలిశారు. ఆ సమయం లో మంచు విష్ణు తనను ఆహ్వానించలేదని చాలా ఫీల్ అయ్యాడు అని వార్తలు వచ్చాయి.తనను ఆహ్వానించని ఆ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పేర్నినాని ని తమ ఇంటికి పిలిచి కండువా కప్పి మరీ సన్మానించి మీటింగ్ సమావేశం కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
మంత్రి మాకు అన్ని చెప్పాడని ట్వీట్ చేసి వివాదాస్పదం అయ్యాడు. ఆ వెంటనే ట్వీట్ తొలగించాడు. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డిని అమరావతి వెళ్లి కలిసి మరోసారి వార్తల్లో నిలిచాడు. తాను రెగ్యులర్ గానే జగన్ అన్న ని కలుస్తానంటున్న చెప్పుకొచ్చిన విష్ణు సినిమా విషయాలు ఏమీ అన్న వద్ద మాట్లాడలేదు అన్నాడు. అదే సమయంలో సీఎం జగన్ తో మీటింగ్ కి నాన్న గారికి కూడా ప్రభుత్వం వారు ఆహ్వానించారు. కానీ కొందరు ఆహ్వానం నాన్న కు అందకుండా చేశారంటూ చిరంజీవిపై ఇండైరెక్టుగా విమర్శలు చేశాడు.ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. మంచు విష్ణు మరోసారి వివాదపు పుట్టను కదిలించాడు. మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ కు చెందిన కొందరు ఈ సమయంలో మంచు విష్ణు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. మీటింగ్ పూర్తి అయ్యింది.. త్వరలోనే టికెట్ల రేట్ల పెంపు జీవో రాబోతుంది.
mega fans and industry public question for manchu vishnu
ఇలాంటి సమయంలో వివాదం ఎందుకు అంటున్నారు. ఒక వేళ చిరంజీవి ఆ మీటింగ్ కి మోహన్ బాబు ను ఆహ్వానించి ఉంటే వెళ్లేవాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణను ఆహ్వానించగా ఆయన వెళ్లలేదు.. ఎన్టీఆర్ కూడా వెళ్లలేదు. మోహన్ బాబు ఎలా చిరంజీవితో కలిసి ఆ మీటింగ్ లో కూర్చునేవాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ చిరంజీవి ఆహ్వానించి ఉంటే మీ నాన్న ఆ మీటింగ్ కు వెళ్లే వాడా ? మంచు విష్ణు దమ్ముంటే ఈ ప్రశ్నకు స్పందించు అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మంచు విష్ణు రకరకాల కామెంట్స్ చేయడం ద్వారా జోకర్ అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో ఆయన మళ్లీ మళ్లీ తనను తాను తగ్గించుకుంటూ సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడం తప్పితే మరి ఏం లేదు. మోహన్ బాబును వెనకేసుకు రావడం.. చిరంజీవి వంటి స్టార్స్ ని తక్కువ చేసి మాట్లాడడం ఆయన స్థాయిని మరింత దిగజారుతుందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.