Home » Entertainment » Mega Fans Bad News
Entertainment

Mega Fans : మెగా ఫ్యాన్స్ కి రక్త కన్నీరు లాంటి బ్యాడ్ న్యూస్ !

Authored By
aruna
The Telugu News | Published on: June 25, 2023, 3:00 pm
Advertisement

Mega Fans : ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కావడం తో అందరు సంతోషంగా ఉన్నారు. అయితే సినిమాలపరంగా ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో మెగా అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయినా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతున్న ఇంతవరకు షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. మెగా అభిమానులు రాంచరణ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు కానీ ప్రస్తుతం రామ్ చరణ్ బిడ్డ పుట్టిన వేడుకలో బిజీగా ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుతున్నారు.

Advertisement

బారసాల తర్వాత రామ్ చరణ్ సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇక డైరెక్టర్ శంకర్ కూడా కమల్ హాసన్ తో ‘ భారతీయుడు 2 ‘ సినిమా ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత గేమ్ చేంజర్ సినిమాను కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టైటిల్ పోస్టర్ తప్ప సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే మెగా అభిమానులు మాత్రం గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కావాలంటూ దిల్ రాజును ట్యాగ్ చేసి మరి సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

Mega fans bad news

Advertisement

ఇక మరోవైపు రాంచరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితం క్రిష్ దర్శకత్వంలో ‘ హరిహర వీరమల్లు ‘ సినిమా స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఎంఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఈ ఏడాది రిలీజ్ అవుతుందేమో అని అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు కానీ అది జరిగేటట్లు కనిపించడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలపై పూర్తి ఫోకస్ చేస్తూ మరోవైపు ఓజీ సినిమాను కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి