Mega Hero : హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న మెగా హీరో.. ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైర‌ల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mega Hero : హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న మెగా హీరో.. ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైర‌ల్

Mega Hero : మెగా ఫ్యామిలీ హీరో ప‌వ‌న్ తేజ త్వ‌ర‌లో ఇంటివాడు కాబోతున్నాడు. పవన్‌ తేజ్‌కు.. మెగాస్టార్‌ చిరంజీవి బాబాయ్‌ అవుతాడు. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో హీరోగా ఆకట్టుకున్నాడు పవన్‌. ఇందులో హీరోయిన్‌గా మేఘన నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఇటీవ‌ల ఇరుకుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :12 August 2022,5:20 pm

Mega Hero : మెగా ఫ్యామిలీ హీరో ప‌వ‌న్ తేజ త్వ‌ర‌లో ఇంటివాడు కాబోతున్నాడు. పవన్‌ తేజ్‌కు.. మెగాస్టార్‌ చిరంజీవి బాబాయ్‌ అవుతాడు. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో హీరోగా ఆకట్టుకున్నాడు పవన్‌. ఇందులో హీరోయిన్‌గా మేఘన నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఇటీవ‌ల ఇరుకుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ, నటుడు సాయిధరమ్‌ తేజ్‌ సహా తదితరులు హాజరయ్యారు.
మెగా సంబురాలు…

తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోను పవన్‌తేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమ అంటే ఏంటో ఆమె వల్లే తెలిసింది. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని’ రాసుకొచ్చాడు. అటు మేఘన కూడా.. ‘నా ప్రేమను కనుగొన్నాను, అతడితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతోంది, కానీ నా చేతులు బరువెక్కుతున్నాయి. ఇక నా జీవితం అంతా నీకే సొంతం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ప‌వ‌న్ తేజ‌. అటు మేఘన బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోంది. రెచ్చిపోదాం బ్రదర్‌ అనే షోకు హోస్ట్‌గా వ్యవహరించడంతో పాటు..

Mega Hero Marriage Fix With A Heroine Goes Viral

Mega Hero Marriage Fix With A Heroine Goes Viral

పలు స్పెషల్ షోలతో టీవీ స్క్రీన్ ప్రేక్షకులకు బాగా దగరైంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వారి ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైర‌ల్ అవుతుండ‌గా, పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లోనే దీనిపై క్లారిటీ ఇవ్వ‌నున్నారు. కాగా, సాయి ధ‌రమ్ తేజ్ మ్యారేజ్ కూడా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. కాగా, బైక్ ఆక్సిడెంట్ తర్వాత మెగా హీరో సాయి తేజ్ చాలా కాలం సినిమాలకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు సాయి తేజ్. సుకుమార్ రైటింగ్స్ వారితో చేతులు కలిపిన సాయి తేజ్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనడం మొదలుపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ తో సాయి తేజ్ ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది