Mega Heros: ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ నుంచే ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే, మెగాస్టార్ చిరంజీవి – ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ నెల 29వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ మెగా మల్టీస్టారర్ మూవీ మీద భారీగా అంచనాలున్నాయి. అంతేకాదు, ఇప్పుడు మెగా హీరోల నుంచి మల్టీస్టారర్ సినిమాలు బాగానే ప్లాన్ చేస్తున్నారు. ఆచార్య సినిమాతో ఖచ్చితంగా మెగా హీరోలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టి రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ.
ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమాను నిర్మించనున్నట్టు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. తమిళంలో సముద్ర ఖని దర్శకత్వం వహించిన వినోదాయ సితం సినిమాను ఆయన దర్శకత్వంలోనే తెలుగులో పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్‌లో నిర్మించనున్నారు. ఈ సినిమా రీమేక్ బాధ్యతలు తన సన్నిహితుడు దర్శకుడు త్రివిక్రమ్ కు అప్పగించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా నటించనున్నారని సమాచారం. ఇద్దరికి మంచి స్క్రిన్న్ స్పేస్ ఉండేలా చూడమని త్రివిక్రం కి చెప్పారట. అంతేకాదు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో కూడా పవన్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. దీనిలో కూడా పవన్ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి – సాయి ధరమ్ తేజ్ కలిసి స్క్రీన్ మీద సందడి చేయనున్నట్టు సమాచారం. మలయాళంలో మంచి హిట్ సాధించిన బ్రో డాడీ తెలుగు రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. దగ్గుబాటు హీరోలు, అక్కినేని హీరోలు చేద్దామనుకున్న ఈ ప్రాజెక్ట్ చివరికి మెగా హీరోల వద్దకు వచ్చి ఆగిందట. ఇక మరిన్ని మెగా మల్టీస్టారర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మెగా హీరోలకు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అసాధారణం. అలాంటి క్రేజ్ మిగతా హీరోలకు లేదని చెప్పక తప్పదు. ఇక మెగా ఫ్యామిలీలో హీరోలు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎలాంటి మల్టీస్టారర్ కథ అయినా ప్లాన్ చేయొచ్చు. అందుకే, ఈ ఫ్యామిలీ నుంచి ఎక్కువగా మల్టీస్టారర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.