Home » Entertainment » Mega Heros Bildly Okay For Script If Those Heroine In Project
Entertainment

Mega Heros : మెగా హీరోలకు ఆ హీరోయిన్స్ ఉంటే కళ్లు మూసుకుని స్క్రిప్ట్ ఓకే చేస్తారట.!?

Authored By
Rame Samhith
The Telugu News | Updated on: December 4, 2022, 7:52 pm
Advertisement

Mega Heros : మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక హీరోయిన్ ని తమ సినిమాల్లో పెట్టుకున్నారు. ఆమె ఎవరు అంటే ఒకప్పటి హీరోయిన్ సంగీత. ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ అంటూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆమె అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. ఈమధ్య తరచు సినిమాల్లో కనిపిస్తున్న సంగీత మెగా హీరోల సినిమాల్లో మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న సంగీత ఆ సినిమాలో ఒక పాటలో మెరిసింది.

Advertisement

అయితే ఈ మూవీ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సంగీత నటిస్తుందని తెలుస్తుంది. క్రిష్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా హరి హర వీరమల్లు సినిమాలో సంగీత కూడా నటిస్తుందట. ఈ మూవీలో సంగీత నటించడం మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. అలా ఎందుకు అంటే ఆమె ఉంటే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయన్న సెంటిమెంట్ మెగా ఫ్యాన్స్ లో ఉంది.రీసెంట్ గా మసూద సినిమాలో నటించింది సంగీత. ఈమధ్య కాలంలో ఆమెకి మరింత బూస్టింగ్ ఇచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మసూదనే.

Mega Heros bildly okay for script if those heroine in project

Advertisement

మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీలో నటించినా సరే ఆ మూవీతో వరుస ఛాన్సులు అందుకుంటుంది. మొత్తానికి మెగా హీరోల సినిమాల్లో సంగీత పక్కా అన్న టాక్ నడుస్తుంది. హరి హర హిట్ పడితే సంగీత బ్యాడ్ సెంటిమెంట్ కూడా పోగొట్టుకున్నట్టే అవుతుంది. హరి హర వీరమల్లులో సాంగ్ తో కాకుండా సంగీతకి తగిన పాత్ర దక్కినట్టు తెలుస్తుంది. ఆ రోల్ లో సంగీత అదరగొట్టేస్తుందని అంటున్నారు. సంక్రాంతికి అనుకున్న హరి హర వీరమల్లు మూవీ సమ్మర్ కి వచ్చినా వచ్చినట్టే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. హరీశ్ శంకర్ మూవీ సెట్స్ మీదకు వెళ్లకుండానే సుజిత్ తో సినిమా కన్ఫర్మ్ చేశారు పవన్ కళ్యాణ్.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి