King maker : కింగ్ మేకర్.. మెగాస్టార్ నటించబోతున్న లేటెస్ట్ సినిమాకి చిత్ర బృందం అనుకుంటున్న టైటిల్ అంటూ ఫిల్మ్ సర్కిల్‌లో ప్రచారం మొదలైంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే మెగాస్టార్ పార్ట్ మాత్రం కంప్లీట్ అయిందట. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ సంగీత, యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్స్‌లో కనిపించబోతున్నారు.
mega-star-is-going-to-come-with-king-maker-title
కాగా త్వరలో మెగాస్టార్ లేటెస్ట్ సినిమాతో సెట్స్ మీదకి రాబోతున్నట్టు గత నెల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంబోత్సవం కూడా జరుపుకుంది. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్‌విఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు.
మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసీఫర్‌కి అఫీషియల్ రీమేక్ సినిమాగా మెగాస్టార్ 153 తెరకెక్కబోతుండగా ఈ సినిమాకి రారాజు అన్న టైటిల్ పెట్టబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ సినిమాకి మరో టైటిల్ పెట్టబోతున్నట్టు ఆ టైటిల్ ఇదేనంటూ ప్రచారం మొదలైంది. ప్రస్తుతం మెగాస్టార్ 153 కి ఫిల్మ్ సర్కిల్‌లో వినిపిస్తున్న టైటిల్ కింగ్ మేకర్. కథ రిత్యా మెగాస్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ టైటిల్‌ని పెట్టబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి మెగాస్టార్ 153 కి రారాజు టైటిల్ ఫిక్స్ చేస్తారా లేక కింగ్ మేకర్ ఫిక్స్ చేస్తారా చూడాలి.
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.