where is the connection on vakeel saab and tirupati by poll
Tirupati bypoll : ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయినవి రెండే రెండు. ఒకటి వకీల్ సాబ్ సినిమా… రెండోది తిరుపతి ఉపఎన్నిక. ఈ రెండు విషయాల గురించే ఏపీ ప్రజలు విపరీతంగా చర్చించుకుంటున్నారు. వకీల్ సాబ్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయి బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా వకీల్ సాబ్… వకీల్ సాబ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అయితే మామూలుగా లేదు.
where is the connection on vakeel saab and tirupati by poll
అయితే… సినిమా రిలీజ్ రోజున స్పెషల్ ప్రీమియర్ షోలకు ఏపీ సర్కారు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే సినిమా టికెట్ల ధరల పెంపుపై నిర్ణయాన్ని కూడా ఆపేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ అభిమానులు నిప్పులు చెరిగారు. సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ధర్నాలు చేశారు. ఏది ఏమైనా… సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
సినిమాను ఎంత ఆపాలన్నా… జగన్ సర్కారు అడుగడుగునా సినిమా ఆపే ప్రయత్నం చేసినా.. సినిమా మాత్రం సూపర్ హిట్ అయిందని పవన్ అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను చూస్తేనే సీఎం జగన్ కు భయం వేస్తోందని… అందుకే సినిమా బెనిఫిట్ షోలను రద్దు చేశారని…. బీజేపీ జాతీయ సెక్రటరీ సునీల్ దియోధర్ అన్నారు.
పవన్ సినిమా రిలీజ్ చేస్తేనే సీఎం జగన ఇంతలా భయపడుతున్నారు.. మరి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ నేతృత్వంలో… బీజేపీ, జనసేన రాష్ట్రమంతా విస్తరిస్తే సీఎం జగన్ పరిస్థితి ఏంటి? వకీల్ సాబ్ సూపర్ హిట్ ఎలా అయిందో.. రేపు తిరుపతిలో కూడా బీజేపీ, జనసేన అభ్యర్థి గెలవడం ఖాయం. మీ రౌడీయిజాలు మా దగ్గర కాదు… మీవి అవినీతి రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు. వాటికి వ్యతిరేకంగా మేం పోరాడుతాం… అని సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ప్రభుత్వం కావాలని బెనిఫిట్ షోలను రద్దు చేసిందన్నారు. వకీల్ సాబ్ సినిమా చూడటానికి థియేటర్ కు వెళ్లిన అనంతరం ఆయన వైవిధంగా వ్యాఖ్యానించారు.
మొత్తం మీద వకీల్ సాబ్ సినిమాకు, తిరుపతి ఉపఎన్నికకు భలే లింక్ పెట్టేశారు.
AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న 175…
Jupiter Transit 2025 : గురు గ్రహం 2025 మే 14న తెల్లవారుజామున 2:30 గంటలకు మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది.…
AIYF : యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కులను కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని, మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా యువత…
Bhuma Akhila Priya : ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాజాగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహోబిలంలో…
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద పేదలకు గృహాలు అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా రాష్ట్ర కాంగ్రెస్…
Ambati Rambabu : జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి…
Pawan Kalyan : అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభ కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
New Ration Cards : ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు ఊరట…
This website uses cookies.