Chiranjeevi : చిరంజీవి బర్త్‌డే… ఆ సందడి మిస్సయ్యిందంటూ అభిమానులు ఫైర్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : చిరంజీవి బర్త్‌డే… ఆ సందడి మిస్సయ్యిందంటూ అభిమానులు ఫైర్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :23 August 2022,3:40 pm

Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమా ల్లో నటిస్తున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఇప్పుడు గాడ్ ఫాదర్‌ సినిమా తో దసరా కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అది మాత్రమే కాకుండా భోళా శంకర్ మరియు వాల్తేరు వీరన్న సినిమాలతో కూడా చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలు మాత్రమే కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా పట్టాలు ఎక్కబోతుంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది.

మరో వైపు మారుతి దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమా ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. ఇన్ని సినిమా లు లైన్ లో ఉండగా నేడు చిరంజీవి బర్త్‌ డే సందర్బంగా ఏమైనా హడావుడి లేక పోవడం తో అభిమానులకు నిరాశ కలుగుతోంది. గాడ్‌ ఫాదర్‌ నుండి టీజర్ విడుదల అయ్యి కాస్త పర్వాలేదు అనిపించారు. గాడ్‌ ఫాదర్‌ టీజర్ ను నిన్న విడుదల చేయడం తో నేడు ఇతర సినిమా ల నుండి అప్‌డేట్స్ వస్తాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఇప్పటి వరకు ఏ సినిమా నుండి కూడా అదిరి పోయే అప్‌డేట్‌ అయితే లేదు. భోళా శంకర్ సినిమా ను వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో విడుదల చేయబోతున్నట్లుగా ఒక పోస్టర్ ను విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు.

megastar chiranjeevi birthday celebrations not happy fans

megastar chiranjeevi birthday celebrations not happy fans

అంతకు మించి భోళా శంకర్ గురించి ఎలాంటి హంగామా లేదు. మరో వైపు వాల్తేరు వీరన్న సినిమా నుండి తప్పుండా హంగామా ఉంటుందని.. ఫస్ట్‌ లుక్ లేదా టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కాని ఇప్పటి వరకు కనీసం టైటిల్‌ ను కూడా అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు వెంకీ కుడుముల సినిమా కు సంబంధించిన అప్డేట్‌ కూడా లేకుండా పోయింది అంటూ విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి చిరంజీవి బర్త్‌ డే సందర్బంగా కేవలం గాడ్ ఫాదర్‌ సినిమా యొక్క టీజర్‌ తో సరి పెట్టుకోవాల్సి వచ్చిందని అభిమానులు ఉసూరుమంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి