Home » Entertainment » Megastar Vs Super Star 2022 In Sankranthi Race
Entertainment

Megastar : మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ 2022 సంక్రాంతి కి భారీ పోటీ..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: February 9, 2021 10:25 am
Advertisement

Megastar : మెగాస్టార్ వయస్సు 60 ప్లస్ అయినా తెర మీద కనిపించాడంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఏళ్లుగా ఇండస్ట్రీ ని ఏలుతున్న మెగాస్టార్ మూవీ తెరమీద వస్తుందంటే చాలు తెలుగు ప్రేక్షకుల్లో సందడి మొదలవుతుంది. అలాంటిది కరోనా కల్లోలం తరువాత యమ జోరుగా ఉన్న చిరు వరుస ప్రాజెక్ట్ లతో హల్ చల్ చేసేందుకు బరిలో దూకేస్తున్నాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం నాలుగు ఐదు సినిమాలతో సందడి చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు చిరు. కొరటాల శివ తో ఆచార్య సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ మూవీ లో రాంచరణ్ స్పెషల్ అట్రాక్షన్ కావడం తో చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇది ఇలా ఉండగా తన మేనల్లుడు నటించిన ఉప్పెన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన మెగాస్టార్ మరో లడ్డూ లాంటి వార్త చెప్పారు.

Advertisement

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బాబీ దర్శకత్వం లో ఓ మూవీ ని కన్ ఫర్మ్ చేసి తన అభిమానులను ఖుషి చేశారు. అయితే దీనికంటే ముందే ఇప్పటికే ఓకే చేసిన మోహన్ రాజా డైరెక్షన్ లోని లూసిఫర్, మెహర్ రమేష్ డైరెక్షన్ లో ని వేదాళం రీమేక్ లో నటించేందుకు రెడీ అయ్యారు. ఈ మధ్యలో గోపీచంద్ మలినేనితో తమిళ రీమేక్ ను ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇక అసలు విషయానికి వస్తే సాధ్యమైనంత వరకు తన సినిమాలను త్వరగా కంప్లీట్ చేయాలనీ చిరు ట్రై చేస్తున్నారు. 2022 లో సంక్రాంతి బరిలో నిలబడాలని తహతహ లాడుతున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రణాళికను రచిస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే 2022 సంక్రాంతి కి మెగాస్టార్, సూపర్ స్టార్ కు భారీ పోటీ ఉండబోతోందని ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Megastar : టార్గెట్ టైం కి రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేస్తామని దర్శకుడు పరుశురాం ఆఫిషల్ గా అనౌన్స్ చేశాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. కొన్నియాక్షన్, రొమాంటిక్ సీన్స్ ను దుబాయ్ లో ప్లాన్ చేశాడు దర్శకుడు. టార్గెట్ టైం కి రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ పందెం కోళ్ల ఆటను చూసేందుకు ఇటు మెగాస్టార్ , అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి