Home » Entertainment » Meher Ramesh Special Birthday Wishe To Sreemukhi
Entertainment

Sreemukhi : శ్రీముఖిని ఆకాశానికెత్తేశాడుగా.. మెహర్ రమేష్ మామూలోడు కాదు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 11, 2022, 10:00 pm
Advertisement

Sreemukhi : బుల్లితెరపై యాంకర్‌గా శ్రీముఖికి మంచి ఫాలోయింగ్ ఉంది. అలానే వెండితెరపై నటిగానూ శ్రీముఖి తన మార్క్ వేసుకుంది. రామ్, బన్నీ సినిమాల్లో సైడ్ కారెక్టర్లు చేసిన శ్రీముఖి.. మరి కొన్ని చిత్రాల్లోనూ మెప్పించింది. ఇక ఈ మధ్యే హీరోయిన్‌గా మారింది. క్రేజీ అంకుల్స్ అని ఓ చెత్త సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా దారుణమైన డిజాస్టర్‌గా మిగిలింది.ఇక ఇప్పుడు శ్రీముఖి బుల్లితెర, వెండితెర అంటూ ఫుల్ బిజీగా మారిపోయింది.

Advertisement

బిగ్ బాస్ షోతో శ్రీముఖి ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.బిగ్ బాస్ మూడో సీజన్ చివర్లో గెస్టుగా స్టేజ్ మీద చిరంజీవి సందడి చేశాడు. ఆ సమయంలో శ్రీముకి చటుక్కున చిరంజీవి బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. ఈ ఘటనతో చిరు కూడా ఒకింత షాకైనట్టున్నాడు. మొత్తానికి ఇప్పుడు శ్రీముఖి ఏకంగా చిరంజీవి సినిమాలో నటిస్తోంది.చిరంజీవి మెహర్ రమేష్ కాంబోలో భోళా శంకర్ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళంలో వచ్చిన అజిత్ వేదాళం సినిమాకు ఇది రీమేక్.

Meher Ramesh Special Birthday Wishe To Sreemukhi

Advertisement

అయితే ఇందులో శ్రీముఖికి కూడా ఓ పాత్రను పోషిస్తోంది. ఈ క్రమంలోనే మెహర్ రమేష్‌తో పరిచయం ఏర్పడినట్టుంది. ఇక నిన్న శ్రీముఖి బర్త్ డే. ఈ సందర్భంగా మెహర్ రమేష్ ఓ స్పెషల్ పోస్ట్ కూడా వేసేశాడు.శ్రీముఖి ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెబుతూ శ్రీముఖికి బర్త్ డే విషెస్ చెప్పాడు మెహర్ రమేష్. ఇక మెహర్ రమేష్ విషెస్‌కు శ్రీముఖి స్పందించింది. భోళా శంకర్‌లో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సర్ అని చెప్పుకొచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి