Mohan Babu : నేను అసమర్థుడిని కాదు.. చిరంజీవికి మోహన్ బాబు కౌంటర్?
Mohan Babu : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్‌గా హీరో మంచు విష్ణు ఎన్నికైన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలో మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యులతో కలిసి విష్ణు తండ్రి, టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనను విమర్శించే వారికి మోహన్ బాబు కౌంటర్ గట్టిగానే ఇచ్చారు.
Mohan Babu : గౌరవాన్ని కాపాడుకోవాలన్న మోహన్ బాబు..
పదిహేడేళ్ల కిందట తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నానని, ఇప్పుడు తన బిడ్డ మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని చెప్పారు. అందరి ఆశీస్సులతోనే మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యారని తెలిపారు. ఈ క్రమంలోనే తనపై కొందరు అనవసరంగా మాట్లాడుతున్నారని మోహన్ బాబు అన్నారు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసి తర్వాత విజృంభిస్తుందని, సముద్ర కెరటాలు సైతం అలసిపోయానుకుంటే సునామీలా వచ్చేస్తాయని, ఆ మాదిరగా తాను మాట్లాడగలనని మోహన్ బాబు చెప్పకనే చెప్పారు. కొందరు తనను గురించి మాట్లాడుతున్నారని, అయితే, తాను మౌనంగా ఉన్నానని, అలా అని తాను అసమర్థుడిని కానని డైలాగ్ కింగ్ అన్నారు.
దివంగత పీవీ నరసింహరావు అప్పట్లో ప్రధానిగా ఉన్నప్పుడు తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని, కొందరు కావాలని నోరుంది కదాని ఏదో ఒక వేదికపై రాజకీయంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మోహన్ బాబు చిరంజీవికి ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ వేశాడని సోషల్ మీడియా వేదికగా పలువురు చర్చించుకుంటున్నారు. ఇకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఎలక్షన్స్‌లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన పదకొండు మంది ‘మా’ ప్రెసిడెంట్ విష్ణుకు రాజీనామా సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రకాశ్‌రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు మీడియాకు చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేదంటే తాము ఆర్టిస్టుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తామని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఈ క్రమంలోనే తాను ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, అది ఉపసంహరించుకోవాలంటే తనకు తెలుగు వాళ్లు కాని వారు ఎవరైనా మా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చనే నిబంధనను మార్చబోమని హామీ ఇవ్వాలని కోరారు. ఈ విషయమై మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి మరి..