Mohan Babu: సినీ ఇండస్ట్రీకి సంబంధించిన లెజండరీస్‌లో మోహన్ బాబు ఒకరు. ఆయన తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్‌లో మోహన్ బాబు నట విశ్వరూపం అద్వితీయం. తాజాగా ఆయన సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నారు. మోహన్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రం డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కగా, మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పేరు మీద బ్యానర్‌ను స్టార్ట్ చేసి నిర్మాతగా ఓ సినిమా చేయాలని అనుకున్నాను. అప్పట్లో టాప్ రైటర్‌గా పేరున్న ఎం.డి.సుందర్‌గారిని కలిశాను. ఆయన ఈ సినిమా కోసం 50 కథలు చెప్పారు. నాకు ఏదీ నచ్చలేదు. చివరగా ఓ కథ చెప్పారు. నచ్చడంతో సినిమా చేస్తానని అన్నారు. ‘ఆ సినిమాను కన్నడలో రాజ్ కుమార్‌గారు ‘అనబలం జనబలం’ పేరుతో చేశారు. కానీ సినిమా ప్లాప్ అయ్యింది ఆలోచించండి’ అని సుందర్‌గారు అన్నారు. పర్లేదు సార్! చేస్తాను అన్నాను.అంతకు ముందు సిల్వర్ జూబ్లీ ఇచ్చిన డైరెక్టర్ సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాడని తెలియడంతో ఆయన్ని పిలిపించాను.
ఊహించండి.. అదెంత రిస్కో మరి. ఆ సినిమా ప్లాప్ అయితే ఇల్లు అమ్మేసి రోడ్డు మీదకు వచ్చేయాల్సిందే. కానీ రిస్క్ చేశాను. కొన్ని సందర్భాల్లో రిస్క్ చేయాలి. కృష్ణగారి తమ్ముడు ఆది శేషగిరిరావుగారితో మంచి అనుబంధం ఉంది. ’ఓ పెద్ద సినిమా చెప్తాను, ఆ సినిమా మీద దీన్ని వెయ్’ అని ఆయన అన్నారు. ఆ పెద్ద సినిమా పేరు చెప్ప కూడదు. కానీ నా సినిమా పెద్ద హిట్ అయ్యింది. పెద్ద సినిమా ప్లాప్ అయ్యింది. కాలం కలిసొచ్చింది. రిస్క్ చేశాను. జీవితంలో రిస్క్ చేయకుండా ముందుకు సాగలేం అంటూ మోహన్ బాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.