Mohan Babu : అదే జ‌రిగి ఉంటే, రోడ్డు మీద ప‌డేవాడిని.. మోహ‌న్ బాబు సంచ‌ల‌న కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mohan Babu : అదే జ‌రిగి ఉంటే, రోడ్డు మీద ప‌డేవాడిని.. మోహ‌న్ బాబు సంచ‌ల‌న కామెంట్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :13 February 2022,2:00 pm

Mohan Babu: సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన లెజండ‌రీస్‌లో మోహ‌న్ బాబు ఒక‌రు. ఆయ‌న త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు చేశారు. హీరోగా, విల‌న్‌గా, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌లో మోహ‌న్ బాబు న‌ట విశ్వ‌రూపం అద్వితీయం. తాజాగా ఆయ‌న స‌న్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నారు. మోహన్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో తెర‌కెక్క‌గా, మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో మోహ‌న్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

1982లో శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ పేరు మీద బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి నిర్మాత‌గా ఓ సినిమా చేయాల‌ని అనుకున్నాను. అప్ప‌ట్లో టాప్ రైట‌ర్‌గా పేరున్న ఎం.డి.సుంద‌ర్‌గారిని క‌లిశాను. ఆయన ఈ సినిమా కోసం 50 క‌థ‌లు చెప్పారు. నాకు ఏదీ న‌చ్చ‌లేదు. చివ‌ర‌గా ఓ క‌థ చెప్పారు. న‌చ్చడంతో సినిమా చేస్తాన‌ని అన్నారు. ‘ఆ సినిమాను క‌న్న‌డ‌లో రాజ్ కుమార్‌గారు ‘అన‌బ‌లం జ‌న‌బ‌లం’ పేరుతో చేశారు. కానీ సినిమా ప్లాప్ అయ్యింది ఆలోచించండి’ అని సుంద‌ర్‌గారు అన్నారు. పర్లేదు సార్! చేస్తాను అన్నాను.అంత‌కు ముందు సిల్వ‌ర్ జూబ్లీ ఇచ్చిన‌ డైరెక్ట‌ర్ సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాడ‌ని తెలియ‌డంతో ఆయ‌న్ని పిలిపించాను.

mohan babu speech in son of india topic now

mohan babu speech in son of india topic now

Mohan Babu : రిస్క్ చేస్తేనే థ్రిల్..

ఊహించండి.. అదెంత రిస్కో మ‌రి. ఆ సినిమా ప్లాప్ అయితే ఇల్లు అమ్మేసి రోడ్డు మీద‌కు వ‌చ్చేయాల్సిందే. కానీ రిస్క్ చేశాను. కొన్ని సంద‌ర్భాల్లో రిస్క్ చేయాలి. కృష్ణ‌గారి త‌మ్ముడు ఆది శేష‌గిరిరావుగారితో మంచి అనుబంధం ఉంది. ’ఓ పెద్ద సినిమా చెప్తాను, ఆ సినిమా మీద దీన్ని వెయ్‌’ అని ఆయ‌న అన్నారు. ఆ పెద్ద సినిమా పేరు చెప్ప కూడ‌దు. కానీ నా సినిమా పెద్ద హిట్ అయ్యింది. పెద్ద సినిమా ప్లాప్ అయ్యింది. కాలం క‌లిసొచ్చింది. రిస్క్ చేశాను. జీవితంలో రిస్క్ చేయ‌కుండా ముందుకు సాగ‌లేం అంటూ మోహ‌న్ బాబు ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది