అమ్మ పాత్రలు అమోఘం.. కానీ నిజజీవితంలో అమ్మ కాలేరు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మ పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ హీరోలుగా ఉన్న టైంలో అమ్మపాత్రలకు ఫేమస్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు సూర్యకాంతం. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడాలు లేకుండా తల్లిగా, బామ్మగా ఎన్నీ మూవీస్ లో యాక్ట్ చేసింది సూర్యకాంతం. ఆవిడ మాటలు, పాత్రలు ఇప్పటికీ జనాలకు గుర్తుంటాయి. ఆవిడకు మూవీస్ లో మాత్రమే పిల్లలున్నారు. కానీ నిజజీవితంలో లేరు. ఈ విషయంలో ఆమె బాధపడకుండా.. సెట్ లో ఉన్న ఆర్టిస్టులంతా తన పిల్లలే అని చెప్పేదని చాలా మంది తమ ఇంటర్యూలలో చెప్పారు.
సూర్యకాంతం తర్వాత అమ్మ పాత్రలకు పెట్టింది పేరు నిర్మలమ్మ. పలనా సినిమాలో అమ్మ పాత్ర ఉంది అనగానే ఆ పాత్ర నిర్మలమ్మే చేయాలి అనేలా పేరు సంపాదించుకుంది.గ్యాంగ్ లీడర్ మూవీలో చిరంజీవిగా బామ్మాగా యాక్ట్ చేసింది. వీరి తర్వాత అమ్మ పాత్ర అంటే అన్నపూర్ణదే. మొదట్లో కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా చేసినా.. తర్వాత సైడ్ క్యారెక్టర్లకు పరిమితమైంది. తర్వాత ఆమెకు అమ్మ క్యారెక్టర్ బాగా గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆమెకు సైతం పిల్లలు లేరు. ఒక పాపని దత్తత తీసుకొని పెంచి పోషించారు. రమప్రభ విషయానికి వస్తే చాలా మూవీస్ లో ఆమె హీరో, హీరోయిన్లకు తల్లిగా యాక్ట్ చేశారు.
Suryakantham : పాత్రలకు ప్రాణం..
శతర్ బాబును పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే విడిపోయారు. ఆవిడకు సైతం పిల్లలు లేరు. ఇక ప్రస్తుతం పూరీజగన్నాథ్ తీసిన ప్రతి మూవీలో ఆమెకు ఓ పాత్ర ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు పెరగడంతో పూరీ జగన్నాథ్ నెలకు కొంత డబ్బును ఆమెకు పంపుతున్నారు. సింగర్ చిత్రకు సైతం పిల్లలు లేరు. చాలా మూవీస్‌లో అమ్మ పాత్రల్లో యాక్ట్ చేశారు. ఇలా వీరు ఇండస్ట్రీలో చాలా మందికి తల్లులుగా యాక్ట్ చేసినా.. నిజజీవితంలో తల్లులు కాలేకపోయారు.