annapurnamma : సుమ, రాజీవ్ కనకాలని శాపనార్థాలు పెట్టిన నటి అన్నపూర్ణ..!

0
Advertisement

annapurnamma : ఇండస్ట్రీలో ఒకరి స్థలాలను ఒకరు లాక్కోవడం, ఒక భూములను ఒకరు కబ్జా చేయడం, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేయడం లాంటి వ్యవహారాలు చాలానే జరుగుతుంటాయి. కొందరు ఎదురు తిరిగి తమ ఆస్థులను తాము దక్కించుకుంటే కొందరు మాత్రం ఏమీ చేయలేక బాధను దిగమింగుకొని ఏళ్ళతరబడి అదే తలచుకుంటూ బాధపడే వారూ ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ నటి అన్నపూర్ణ annapurnamma కూడా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో నటించి పాపులారిటీ తెచ్చుకున్న అన్నపూర్ణమ్మ  annapurnammaఇప్పటికే మంచి పాత్రలు వస్తే నటిస్తూనే ఉన్నారు.ఆ తరం నటీ నటుల నుంచి ఈ తరం వారి వరకు అందరికీ ఆమె అంటే ఎనలేని అభిమానం ప్రేమ ఉన్నాయి.

annapurnamma comments suma rajiv kanakala
annapurnamma comments suma rajiv kanakala

ఇన్నేళ్ళ సినీ జీవితంలో ఆమె కాంట్రవర్సీగా మాట్లాడింది లేదు. కానీ ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. సీనియర్ నటి కావడంతో కొన్ని పాత్రలు నచ్చక స్టార్ డైరెక్టర్స్ సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రముఖ దర్శకుడు, ఇండస్ట్రీ గురువుగా పిలిచే దేవదాసు కనకాల (రాజీవ్ కనకాల తండ్రి)తో ఓ ల్యాండ్ ఇష్యూలో మోసపోయానని ఇటీవల బయట పెట్టారు అన్నపూర్ణ. అయితే ఆయన చనిపోవడంతో ఇష్యూని దేవదాసు కనకాల కోడలు సుమ, ఆమె భర్త రాజీవ్ కనకాల దగ్గర ప్రస్తావించినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నపూర్ణమ్మ.

annapurnamma : దేవదాసు కనకాల రూపాయి సంపాదించినా కొడుక్కే పెడతాడు కదా

ఈ విషయమై రాజీవ్ కనకాల annapurnamma కి ఒకసారి ఫోన్ చేశా.. అప్పుడు మాట్లాడాడు.. ఆ తరువాత ఎప్పుడు చేసినా బిజీ అనే వస్తుంది. దాంతో ఈ నెంబర్ కరెక్టేనా అని అనుమానం వచ్చి అడిగితే ఒకతను ఇదే నెంబర్ అని చెప్పారు. దాంతో నా నంబర్ బ్లాక్ చేశారని అర్థమైంది. అని చెప్పుకొచ్చారు. ఇక రాజీవ్ కనకాల కూడా దీని గురించి నాకేం తెలియదని అంటున్నారు అని మధ్యవర్తి చెప్పారని వాపోయింది. దేవదాసు కనకాల రూపాయి సంపాదించినా కొడుక్కే పెడతాడు కదా, ఆయనకి తెలియకపోవడం ఏంటయ్యా అని మధ్యవర్తితో అన్నారాట.అంతేకాదు గతంలో గొడవ అయినప్పుడు కూడా రాజీవ్ కనకాల ఉన్నాడు. కనీసం భూమి మొత్తం ఇవ్వకపోయినా.. కొంతైనా ఇవ్వొచ్చు కదా.. నేను భూమికి భూమే కదా అడుగుతుంది..అని చెప్పారు.

annapurnamma comments suma rajiv kanakala
annapurnamma comments suma rajiv kanakala

మధ్యవర్తి వాళ్లదగ్గర ఏం లేదంటమ్మా అని ఆయన చెప్పడంతో పోన్లే లేకపోతే అనుకున్నా. ఈ రకంగా నష్టపోవడం, మోసపోవడం గురించి నేను చెప్పుకొని దండగ.. జరిగిన దాంట్లో నా తప్పుకూడా ఉంది.22 ఏళ్ల క్రితమే దేవదాసు కనకాల నాకు భూమిని అమ్మారు. నాకు అమ్మిన భూమిని మళ్లీ వెంచర్ వేసి వేరే వాళ్లకి అమ్మేశారు. దేవదాసు కనకాల నాకు భూమి అమ్మిన విషయం ఆయన కొడుకు రాజీవ్ కనకాల కుటుంబంలో వాళ్లకి కూడా తెలుసు. కానీ తెలియదని చెప్తారు. పోనివ్వండి.. వాళ్లు ఈ భూమిని పట్టుకుని ఉంటారా?? నేను పట్టుకోకుండా పోతానా? కాస్త ముందు నేను పోతా.. వెనుక వాళ్లు వస్తారంతే. మొత్తానికి అందరూ పోయేవాళ్లే. ఇది శాపం అనుకోండి.. తిట్టడం అనుకోండి…అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు అన్నపూర్ణమ్మ.

ఇది కూడా చ‌ద‌వండి ==> యాంకర్ సుమ ఇళ్లు ఎంత లగ్జరీగా ఉందో తెలుసా?.. వీడియో వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎప్పుడూ తొక్కేస్తోంది.. సుమపై శ్రీముఖి అసహనం!

ఇది కూడా చ‌ద‌వండి ==> నీలో నాకు న‌చ్చింది అదే.. ర‌ష్మీపై ఓంకార్ కామెంట్స్ వీడియో వైర‌ల్..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారు.. అస‌లు కార‌ణం ఇదే.. బాలకృష్ణ

Advertisement