Most Eligible Bachelor : హిట్ బాటలో అఖిల్ అక్కినేని.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఫస్డ్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Authored By mallesh | The Telugu News | Published on: October 16, 2021, 9:10 pm

Most Eligible Bachelor : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వారసుడిగా బాలనటుడిగానే వెండితెరకు ఇంట్రడ్యూస్ అఖిల్. ‘సిసింద్రి’ చిత్రంలో బుడిబుడి నడకలతో బుజ్జి పాపాయిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే అక్కినేని నాగేశ్వర‌రావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘మనం’ చిత్రం ద్వారా వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. అయితే, ఇందులో కెమియో అప్పియరెన్స్ మాత్రమే ఇచ్చాడు. హీరోగా లీడ్ రోల్ ప్లే చేసిన చిత్రం ‘అఖిల్’ కాగా ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో కనిపించిన అఖిల్ తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’గా కనిపించాడు.

most eligible bachelor Movie first day collections

most eligible bachelor Movie first day collections

‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని హిట్ దిశగా సాగిపోతున్నది. ఈ సినిమా ద్వారా అఖిల్ ఖాతాలో తొలి భారీ హిట్ పడిందని అభిమానులు అనుకుంటున్నారు. నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికిగాను రూ. ఒక కోటి 76 లక్షలు, సీడెడ్‌లో రూ. ఒక కోటి పది లక్షలు, ఉభయ గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో రూ.58 లక్షలు, వైజాగ్‌లో రూ.56 లక్షలు, గుంటూరులో రూ.50 లక్షలు, అగ్రరాజ్యం అమెరికాలో 2,35,000 డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ మూవీకిగాను కనీసంగా రూ.12 కోట్లు షేర్ కలెక్షన్స్ వస్తాయని అంటున్నారు.

Most Eligible Bachelor : రొమాన్స్‌లో తాతకు తగ్గ మనవడిగా అఖిల్..

most eligible bachelor Movie first day collections

most eligible bachelor Movie first day collections

గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో అఖిల్, పూజా హెగ్డే కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని అక్కినేని అభిమానులు చెప్తున్నారు. రొమాన్స్‌లో అక్కినేని వారసుడిగా అఖిల్ దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత అఖిల్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు. టాలెంటెడ్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో ‘ఏజెంట్’ సినిమా చేయబోతున్నారు అఖిల్. సురేందర్‌రెడ్డి సూచనల మేరకు ఆ సినిమా కోసం అఖిల్ బాడీ కూడా బిల్డ్ చేశాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాతనే సురేందర్‌రెడ్డి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేస్తారని తెలుస్తోంది. వక్కంతం వంశీ, సురేందర్‌రెడ్డి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబోలో ‘యాథా కాలమ్ తథా వ్యవహారమ్’ చిత్రం అధికారికంగా ప్రకటితమైన సంగతి అందరికీ విదితమే.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp