Most Eligible Bachelor : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వారసుడిగా బాలనటుడిగానే వెండితెరకు ఇంట్రడ్యూస్ అఖిల్. ‘సిసింద్రి’ చిత్రంలో బుడిబుడి నడకలతో బుజ్జి పాపాయిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘మనం’ చిత్రం ద్వారా వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. అయితే, ఇందులో కెమియో అప్పియరెన్స్ మాత్రమే ఇచ్చాడు. హీరోగా లీడ్ రోల్ ప్లే చేసిన చిత్రం ‘అఖిల్’ కాగా ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో కనిపించిన అఖిల్ తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’గా కనిపించాడు.
‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని హిట్ దిశగా సాగిపోతున్నది. ఈ సినిమా ద్వారా అఖిల్ ఖాతాలో తొలి భారీ హిట్ పడిందని అభిమానులు అనుకుంటున్నారు. నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికిగాను రూ. ఒక కోటి 76 లక్షలు, సీడెడ్‌లో రూ. ఒక కోటి పది లక్షలు, ఉభయ గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో రూ.58 లక్షలు, వైజాగ్‌లో రూ.56 లక్షలు, గుంటూరులో రూ.50 లక్షలు, అగ్రరాజ్యం అమెరికాలో 2,35,000 డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ మూవీకిగాను కనీసంగా రూ.12 కోట్లు షేర్ కలెక్షన్స్ వస్తాయని అంటున్నారు.
గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో అఖిల్, పూజా హెగ్డే కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని అక్కినేని అభిమానులు చెప్తున్నారు. రొమాన్స్‌లో అక్కినేని వారసుడిగా అఖిల్ దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత అఖిల్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు. టాలెంటెడ్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో ‘ఏజెంట్’ సినిమా చేయబోతున్నారు అఖిల్. సురేందర్‌రెడ్డి సూచనల మేరకు ఆ సినిమా కోసం అఖిల్ బాడీ కూడా బిల్డ్ చేశాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాతనే సురేందర్‌రెడ్డి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేస్తారని తెలుస్తోంది. వక్కంతం వంశీ, సురేందర్‌రెడ్డి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబోలో ‘యాథా కాలమ్ తథా వ్యవహారమ్’ చిత్రం అధికారికంగా ప్రకటితమైన సంగతి అందరికీ విదితమే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.